అధ్యాయము |
విషయము |
1 | బాప్తిస్మము ఇచ్చు యోహాను భోదించుట, యేసుక్రీస్తు కు బాప్తిస్మము ఇచ్చుట, యేసుక్రీస్తు శోదింపబడుట, మొదటి శిష్యులను పిలచుట, యేసుక్రీస్తు భోదించుట, గలిలయలో ప్రార్ధించి స్వస్థపరచుట |
2 | యేసుక్రీస్తు పక్షవాయువు గల వానిని స్వస్థపరచుట, మత్తయిని పిలచుట, ఉపవాసము గురించి చెప్పుట, సబ్బాతు దినమునకు ప్రభువై ఉన్నాడని తెలియజేయుట |
3 | యేసుక్రీస్తు సబ్బాతు దినమున స్వస్థపరచుట, 12 మందిని ఏర్పరచుకొనుట, బయల్జెబూలు గురించి మాట్లాడుట, తన తల్లి, సహోదరులు ఎవరు అని వివరించుట |
4 | విత్తువాడు, స్థంభము మీది దీపము, విత్తనము రహస్యముగా ఎదుగుట, ఆవగింజ గురించిన ఉపమానములు, సముద్రమును నెమ్మది పరచుట |
5 | యేసుక్రీస్తు దయ్యములను పందుల లోనికి పంపుట, రక్తస్రావము గల స్త్రీ ని స్వస్థపరచుట, సమాజ మందిరపు అధికారి కుమార్తెను లేపుట |
6 | నజరేతు లొ యేసుక్రీస్తు, 12 మందిని పంపుట, యోహాను శిరచ్చేదనము, యేసుక్రీస్తు 5000 మందికి ఆహారము పెట్టుట, నీటి మీద నడచుట, స్వస్థతలు |
7 | శుద్దమైనవి అశుద్దమైనవి, మనుష్యుని హృదయము, సురోఫెనికయ స్త్రీ ని, చెవిటి మూగవానిని స్వస్థపరచుట |
8 | యేసుక్రీస్తు 4000 మందికి ఆహారము పెట్టుట, బెత్సయిదా లొ గృడ్డి వానిని స్వస్థపరచుట, యేసుక్రీస్తు గురించి పేతురు ఒప్పుకోలు |
9 | యేసుక్రీస్తు రూపాంతరము చెందుట, అపవిత్రాత్మ పట్టిన బాలుని స్వస్థపరచుట, శిష్యులలో ఎవరు గొప్ప అనే చర్చ, ఎవరైనను పాపము చేయుటకు మనము కారణము కాకుండుట |
10 | పరిత్యాగము, యేసుక్రీస్తు చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు అని చెప్పుట, ఆస్థి కలిగిన యవనస్థుడు, యేసుక్రీస్తు తన మరణము గూర్చి చెప్పుట, యాకోబు యోహాను ల గురించి విన్నపము, గృడ్డి వానికి చూపు దయచేయుట |
11 | యెరూషలేము లొ విజయోత్సవ ప్రవేశము, వ్యాపారము చేయు వారి బల్లలు త్రోసివేయుట, అంజూరపు చెట్టును ఎండిపోవుట, యేసుక్రీస్తు అధికారము |
12 | ద్రాక్షతోట పనివారి ఉపమానము, కైసరు పన్ను చెల్లించమని చెప్పుట, పునరుద్దానము నందు వివాహము, గొప్ప ఆజ్ఞ, విదవరాలి అర్పణ |
13 | యేసుక్రీస్తు దేవాలయము విద్వంసము, తన రాకడ గురించి చెప్పుట, దినము ఘడియ తెలియదని చెప్పుట |
14 | యేసుక్రీస్తు అభిషేకము, ఆఖరి రాత్రి బోజనము, గెత్సేమనే తోట, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ను మోసము చేయుట, యేసుక్రీస్తు ను యాజకుల సభ కు తీసికొనిపోవుట, పేతురు యేసుక్రీస్తు తెలియదని బొంకుట |
15 | పిలాతు ముందు యేసుక్రీస్తు, సైనికుల చేత పరిహాసము పొందుట, శిలువ వేయబడుట, సమాధి చేయబడుట |
16 | యేసుక్రీస్తు పునరుద్ధానము, శిష్యత్వము యొక్క గొప్ప విధి |