0
వచనములు
0
దేవుడు
0
కుటుంబము
0
నిబంధన

అధ్యాయము యొక్క సారాంశము

దేవుడు నోవహుతోను, అతని కుమారులతోను నిబంధన చేయటము ఈ అధ్యాయములోని ప్రామఖ్యమైన అంశము. నోవహు యొక్క సంతానము ద్వారా భూమిమీద మరలా జనులు విస్తరించాలి అని దేవుడు వారిని దీవించారు. ఈ సమయములోనే దేవుడు వారిని మాంసాహారము తినుటకు అనుమతి ఇవ్వటము జరిగినది. ఎవరూ కూడా జంతువును దాని రక్తముతో తినకూడదు అనేది దేవుని ఆజ్ఞ. ఇక ఎన్నడూ భూమిని తాను జలములద్వారా నాశనము చేయను అని దేవుడు వారితో నిబంధన చేసి దానికి గుర్తుగా మేఘములో ఆయన ధనుస్సు ఉంచినారు. తరువాత నోవహు వ్యవసాయము చేసి ఒక ద్రాక్షతోట వేసాడు. పంట చేతికి వచ్చినపుడు ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా పడియున్నాడు. అది చూచిన తన కుమారుడైన హాము వస్త్రము కప్పకుండా బయటికి వెళ్లి ఆ విషయము తన సహోదరులకు తెలియజేసాడు. వారు తమ తండ్రి దిసమొల చూడకుండా జాగ్రత్తగా వెనుకకు నడుచుకుంటూ వచ్చి ఆయనకు వస్త్రము కప్పి అయన సిగ్గును కాపాడారు. నోవహు మత్తునుండి మేలుకొనిన తరువాత విషయము తెలుసుకొని హాము కుమారుడైన కనానును శపించి, షేమును, యాపెతును దీవిస్తాడు. తరువాతా నోవహు 350 సంవత్సరములు బ్రతికి మరణించటముతో అధ్యాయము ముగుస్తుంది.

అధ్యాయము స్టడీ

  • అధ్యాయములోని విశేషములు
  • అధ్యాయము PPT
  • అధ్యాయములోని స్తుతి, ఆరాధన అంశములు
  • అధ్యాయము ఆడియో (ఆడియో, ఆడియో+వచనములు)
  • అధ్యాయము నుంచి నేర్చుకొనవలసిన పాటములు
  • అధ్యాయములో దేవుని గురించిన ప్రత్యక్షత