పరిశుద్ద గ్రంధము
ఈ సెక్షన్ నందు పరిశుద్ద గ్రంధము గురించిన వివరములు పొందుపరచబడినవి. ఈ పేజీనందు క్రింది విభాగములు కలవు.
పరిశుద్ద గ్రంధము పరిచయము – బైబిలు యొక్క చరిత్ర, విభాగములు, విభజన, ఆవశ్యకత గురించి తెలియజేస్తుంది.
పరిశుద్ద గ్రంధము సంకలనము – పరిశుద్ద గ్రంధములోని 66 పుస్తకముల యొక్క సంకలనము ఎలా జరిగినది, లేఖనముల యొక్క సాధికారికత, పురాతన ప్రతుల వివరముల గురించి తెలియజేస్తుంది.
పరిశుద్ద గ్రంధము కంకార్డేన్స్ – పరిశుద్ద గ్రంధములోని వివిధ అంశముల గురించి లేఖనముల సమకూర్పు. 600 పైగా అంశములు పొందుపరచబడినాయి. అంశముల యొక్క హెడ్డింగ్ లు ఇంగ్లీష్ లో కలవు. లేఖనములు తెలుగులోనే పొందుపరచబడినవి. త్వరలోనే హెడ్డింగ్ లకు తెలుగు తర్జుమా అందజేయబడును.
స్పర్జన్ ఫెయిత్ చెక్ బుక్ – చార్లెస్ స్పర్జన్ గారి ఫెయిత్ చెక్ బుక్ యొక్క అనుదిన ధ్యానములు. Linked to the respective YouTube channel. త్వరలోనే చదువుకొనుటకు టెక్స్ట్ వెబ్ పేజీ ద్వారా అందించగలము
పరిశుద్ద గ్రంధము క్రాస్ రిఫరెన్స్ – పరిశుద్ద గ్రంధములోని వచనములకు మిగిలిన బైబిలు పుస్తకముల నుంచి క్రాస్ రిఫరెన్స్ కొరకు. ఈ లింక్ రిఫరెన్స్ బైబిలు క్రింద ఉపయోగపడును. మొత్తము 6,00,000 పైన రిఫరెన్స్ కలవు
ఎడారిలో సెలయేళ్లు – చార్లెస్ కౌమెన్ గారి అనుదిన ధ్యానములు. (Page is under construction)
పరిశుద్ద గ్రంధము రీడింగ్ ప్లానులు – పరిశుద్ద గ్రంధము ఒక సంవత్సర కాలములో సంపూర్ణముగా చదువుటకు ఉపయోగపడు వివిధ రకముల ప్రణాలికలు.
పరిశుద్ద గ్రంధము వాగ్దానములు – వివిధ సందర్భములలో ఆదరణ పొందుటకు అవసరమైన పరిశుద్ద గ్రంథములోని వాగ్దానముల సమాహారము
బైబిలు స్టడీ – పరిశుద్ద గ్రంధము ఎలా స్టడీ చేయాలి అందుకు ఉపయోగపడు సమగ్ర పద్దతుల వివరణ
పాత నిబంధన
ఈ సెక్షన్ నందు పాత నిబంధనలోని 39 పుస్తకముల యొక్క సమగ్ర వివరములు పొందుపరచబడినవి. ఈ పేజీనందు క్రింది విభాగములు కలవు.
ధర్మశాస్త్రము – ఆదికాండము నుంచి ద్వితియోపదేశాకాండము వరకు
చరిత్ర – యెహోషువ నుంచి ఎస్తేరు వరకు
జ్ఞానము – యోబు నుంచి పరమగీతము వరకు
పెద్ద ప్రవక్తలు – యెషయా నుంచి దానియేలు వరకు
చిన్న ప్రవక్తలు – హోషేయ నుంచి మలాకీ వరకు
పై విభాగములలోని ప్రతి పుస్తకమునకు క్రింది విషయములు పొందుపరచబడినవి.
పుస్తకము రిచయము – పుస్తకము యొక్క పేరు, రచయిత, రచనాకాలము, ముఖ్యమైన వ్యక్తులు, ప్రదేశములు తదితర వివరములు
పుస్తకము అవగాహన – పుస్తకము యొక్క అధ్యాయముల యొక్క సారాంశము, నేర్చుకొనవలసిన పాటములు, వాటిని జీవితమునకు ఎలా అన్వయించుకోవాలి, స్తుతింప వలసిన, ఆరాధించ వలసిన అంశములు, పుస్తకము యొక్క అధ్యాయముల నిర్మాణము
అధ్యాయముల స్టడీ – పుస్తకములోని ప్రతి అధ్యాయము గురించి వివరముగా స్టడీ చేయుటకు. ప్రతి అధ్యాయము యొక్క సారాంశము, వచనముల రిఫరెన్స్, PPT, పారలల్ బైబిలు, అధ్యాయము వచనముల కామెంటరీ, పదములకు అర్ధములు……
పుస్తకము చార్టులు – పుస్తకములోని వివిధ అంశములను సులభముగా అర్ధము చేసికొనుటకు చిత్రముల రూపములో అందజేయబడును
పుస్తకము వ్యాసములు – పుస్తకములోని అంశముల గురించి వివిధ కోణములలో వివరించే ఆర్టికల్స్
క్రొత్త నిబంధన
ఈ సెక్షన్ నందు పాత నిబంధనలోని 27 పుస్తకముల యొక్క సమగ్ర వివరములు పొందుపరచబడినవి. ఈ పేజీనందు క్రింది విభాగములు కలవు.
సువార్తలు – మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు
చరిత్ర – అపోస్తలుల కార్యములు
పౌలు పత్రికలు – రోమీయులకు నుంచి హెబ్రీయులకు వరకు
ఇతర పత్రికలు – యాకోబు నుండి యూదా వరకు
ప్రవచనము – ప్రకటన
ప్రతి విభాగములోని పుస్తకమునకు పైన పాత నిబంధన సెక్షన్ లో ఉన్న మాదిరిగానే విషయములు పొందుపరచబడినవి.
ఈ సెక్షన్ నందు పరిశుద్ద గ్రంధము నందలి ప్రతి కుటుంబము యొక్క వంశవృక్షము ఇవ్వబడినది. circles మీద క్లిక్ చేయటము ద్వారా వృక్షము expand and collapse అవుతుంది.
ఈ సెక్షన్ నందు పరిశుద్ద గ్రంధము ఎలా అధ్యయనము చేయాలి అందుకు ఉపయోగపడు 8 రకముల పద్దతుల గురించి వివరించటం జరిగినది. దీనితో పాటుగా
- బైబిలు అధ్యయనము ఎందుకు చేయాలి
- ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి
- అవసరమైన వనరులు
- బైబిలు అధ్యయనమునకు ఎలా సిద్దపడాలి
- బైబిలు స్టడీ నందు ఉపయోగపడు వెబ్ సైట్ వివరములు
గురించి కూడా వివరించబడినది