కీర్తనలు 31:24 |
యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. |
కీర్తనలు 33:18 |
వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును |
కీర్తనలు 38:15 |
యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని యున్నాను నా కాలు జారిన యెడల వారు నామీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను. |
కీర్తనలు 43:5 |
నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను. |
కీర్తనలు 71:5 |
నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. |
కీర్తనలు 78:5-7 |
రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును |
యిర్మియా 17:7 |
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. |
అపోస్తలుల కార్యములు 23:5 |
నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. |
అపోస్తలుల కార్యములు 24:15 |
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవుని యందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి యెదుట ఒప్పుకొనుచున్నాను. |
రోమీయులకు 5:2 |
మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులోనిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయ పడుచున్నాము. |
రోమీయులకు 5:5 |
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. |
రోమీయులకు 15:4 |
ఏలయనగా ఓర్పు వలనను, లేఖనములవలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకైపూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. |
రోమీయులకు 15:13 |
కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. |
ఎఫెసీయులకు 1:17, 18 |
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, |
ఎఫెసీయులకు 4:4 |
శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. |
కొలొస్సయులకు 1:3-5 |
పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తుయేసు నందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులుచెల్లించుచున్నాము. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. |
కొలొస్సయులకు 1:27 |
అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను |
1దేస్సలోనీకయులకు 5:8 |
మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. |
తీతుకు 1:2 |
నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో |
తీతుకు 2:11-13 |
ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు భోదించుచున్నది |
తీతుకు 3:6, 7 |
మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. |
హెబ్రీయులకు 3:6 |
అయితే క్రీస్తు కుమారుడై యుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు. |
హెబ్రీయులకు 6:19 |
ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది. |
1పేతురు 1:3, 4 |
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను |
1పేతురు 1:13 |
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. |