అధ్యాయము యొక్క సారాంశము
దేవుడు సృష్టిని ఎలా చేసారు అనేది ఈ అధ్యాయము యొక్క సారాంశము. బైబిలు గ్రంథములోని మొట్ట మొదటి అధ్యాయము, మొదటి వచనములో దేవుడు తనను తాను మనకు పరిచయము చేసుకున్నారు. ఆయన నామములలో ఒకటి అయిన ఎలోహిమ్ ఈ అధ్యాయములో ప్రస్తావించబడినది. మనము చూస్తున్నటువంటి ఈ సృష్టి ఉనికిలోనికి ఎలా వచ్చినది అనే విషయము ఈ అధ్వియాయములో విపులముగా వివరించబడినది. దేవుడు ఈ సృష్టి మొత్తమును తన నోటి మాటచేత చేసినట్లుగా ఈ అధ్యాయము వివరిస్తుంది. దేవుడు ఎన్ని దినములలోగా ఈ సృష్టిని పూర్తిచేశారు, ఏ దినము ఏవి సృజించబడినాయి అనేటటువంటి వివరములు ఈ అధ్యాయమునందు పొందుపరచబడినవి. ఈ అధ్యాయములో గమనించవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయము దేవుని స్వరూపము మరియు పోలికెలో మానవులు సృజించబడుట. దేవుడు నరులను ఆశీర్వదించి భూమిమీద సర్వాధికారము వారికి అప్పగించినారు. తాను సృజించిన జీవరాసులకు ఆహారము సమకూర్చి పోషణ ఏర్పాటు చేయటము జరిగినది. దేవుడు తాను చేసిన సమస్తమును చూసినపుడు అది ఆయన కన్నులకు చాలామంచిదిగా కనబడినదని ఈ అధ్యాయము మనకు వివరిస్తుంది.
అధ్యాయము యొక్క నిర్మాణము
దేవుడు సృష్టి చేయుట – (1-2)
మొదటి రోజు సృష్టి (3-5)
రెండవ రోజు సృష్టి (6-8)
మూడవ రోజు సృష్టి (9-13)
నాలుగవ రోజు సృష్టి (14-19)
ఐదవ రోజు సృష్టి (20-23)
ఆరవ రోజు సృష్టి (24-31)