- కధల పుస్తకముగా చదువకూడదు
- కేవలము ఆధ్యాత్మిక సంధర్భముల కోసమే అన్నట్లుగా చదువకూడదు
- తప్పులు పట్టుకోవటానికి అన్నట్లుగా చదువకూడదు
- కేవలము చదివి వదిలేసే విధముగా చదువకూడదు
- ఎదుటివారిని విమర్శించుటకు చదువకూడదు (అన్యులు అయినా, ఇతర క్రైస్తవులు అయినా)
- సందర్భమును విడిచిపెట్టి చదువకూడదు
- ఆ కాలము యొక్క జీవనపద్దతులు, ఆచారములు మరచిపోయి వ్యక్తులు చేసిన పనులను అపార్ధము చేసికోకూడదు
- ఒక పద్దతి లేకుండా ఇష్టము వచ్చిన చోట వచనము తీసుకొని చదువకూడదు
- ఇతర మత గ్రంధములతో పోల్చి చదువకూడదు
- కేవలము విజ్ఞానము సంపాదించుకోవటానికి చదువకూడదు
- వచనములో మనకు నచ్చిన భాగము తీసుకొని, మిగతా భాగము వదిలేయకూడదు. వచనమును దాని సంపూర్ణతలో చూడాలి
- మన ప్రవర్తన సమర్ధించుకోవటానికి కారణములు వెతుకుటకు చదువకూడదు
- కేవలము లాభము ఆశించి, స్వార్ధము కోసము చదువకూడదు
- చరిత్ర గురించి తెలిపే పుస్తకముగా చదువకూడదు
- ఎవరికీ తెలియని ప్రత్యక్షతలు తెలుసుకోవాలి అని చదువకూడదు
- క్రొత్త నిబంధన మాత్రమే ప్రాముఖ్యమైనది, పాత నిబంధన కాదు అనే అభిప్రాయముతో చదువకూడదు
- బైబిలు పరిధి దాటి ఆలోచన, నిర్ధారణలు చేయకూడదు
- బైబిలు మీద వ్రాయబడిన పుస్తకములు, ఇతర పుస్తకములలోని అంశములు బైబిలును దృవీకరించుటకు ప్రామాణికముగా తీసుకోకూడదు
- మనము నేర్చుకున్న విషయములు బైబిలులోని మిగతా విషయములతో విభేదించకూడదు
- పూర్తిగా కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా అధ్యయనము చేయటము మంచిది కాదు. ఏకాగ్రత దెబ్బతినే అవకాశము ఉన్నది. బైబిలు, నోట్ బుక్ ద్వారా ప్రారంభించాలి