- దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము కలిగియుండాలి.
- తమ జీవితమనకు దేవుని యొక్క ఆవశ్యకతను గుర్తించగలిగి యుండాలి
- తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉంటే చాలా మంచిది. బైబిలును చదువుటకు అవసరము లేదు కాని అధ్యయనము చేయుటకు ఈ అనుభవము చాలా ఉపకరిస్తుంది
- దేవుని వాక్యము పట్ల ప్రేమ కలిగి ఉండాలి
- కష్టపడి సమయము వెచ్చించి నేర్చుకోవటానికి సుముఖత కలిగి ఉండాలి
- దేవుని మాటకు సంపూర్ణముగా లోబడే మనస్సు/గుణము కలిగి ఉండాలి
- చిన్నపిల్లల వంటి హృదయము ఉండాలి
- వాక్యము దేవుని యొక్క మాటగా పరిగణించాలి. మనుష్యుల చేత వ్రాయబడినదిగా చూడకూడదు
- ప్రార్ధనా పూర్వకముగా చదవాలి, సిద్దపడాలి
- ప్రతిరోజూ క్రమము తప్పకుండా చేయటానికి ప్రయత్నము చేయండి
- పూర్తి ఏకాగ్రతతో చేయాలి, చదవాలి
- ప్రతిసారి చదువబడిన వాక్యములో దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి చూడటానికి ప్రయత్నము చేయండి
- చదివిన వచనములను గుర్తు పెట్టుకోవటానికి లేదా కంటస్థము చేయటానికి ప్రయత్నము చేయండి
- సమయమును సద్వినియోగము చేసుకోవటానికి ప్రయత్నము చేయండి
- మ్రొక్కుబడిగా, హడావుడిగా చేయకండి. ఏదైనా ఒకరోజు కుదరకపోతే విరామము ఇవ్వండి
- పరిశుద్దాత్మ దేవుని సహాయము, నడిపింపు అడగండి
- మార్పు అనేది కష్టము. సాతాను మనతో ఎప్పుడూ ఎదురు పోరాడుతూనే ఉంటాడు. అయినా పట్టుదలతో ప్రయత్నించాలి
- మీలో మార్పుకోసము తగిన సమయము తీసుకొని హడావుడి లేకుండా మీ సామర్ధ్యము కొలది సాధ్యమయ్యే విధముగా ప్రణాళిక సిద్దము చేసుకొనండి
- బైబిలు గురించి సరైన అవగాహన కలిగిన వారిని నాయకుడిగా పెట్టుకొనండి
- మీరు నేర్చుకునే అంశములు బైబిలు పరిధిదాటి లేకుండా చూసుకొనండి
- మొదటిరోజునే మనకు సమస్తము అర్ధము కావు అని గుర్తెరిగి వాక్యము అర్ధము అవటానికి, అవగాహన రావటానికి తగిన సమయము తీసుకొనండి
- మొదటిగా మీరు చేయవలసిన స్టడీ చేయండి. మీ ఆలోచనలు, దేవుడు మీతో మాట్లాడిన అంశములు వ్రాయండి. తరువాత కంప్యూటర్ సాఫ్ట్ వేర్, కామెంటరీలు చదవండి.
- పరిశుద్ద గ్రంధము జీవితము మార్చటానికి కాని మనము క్రొత్త సిద్దాంతములు చేయటానికి కాదు అని గుర్తెరిగి వాక్యము మీ జీవితము గురించి ఏమి చెప్తున్నది అనే కోణములో చూడండి
- మీరు వ్రాసుకున్న నోట్స్ మీరు కొన్ని దినములు లేదా సంవత్సరముల తరువాత చూస్తే మరలా దేవునిలో ప్రోత్సహించబడేలా వ్రాసుకొనండి.
- మీరు ఎంత కష్టపడ్డారు అని కాకుండా దేవుడు మీ నిమిత్తము ఏమి చేసియున్నారు అనేది హైలైట్ చెయ్యండి
- మీరు వ్రాసుకున్న నోట్స్ మీ తరువాతి తరములను ప్రోత్సహించే విధముగా ఉండాలి. మీ పిల్లలు మీ అనుభవములను చాలా సీరియస్ గా తీసుకుంటారు అని గుర్తించండి
- మీరు వ్రాసుకున్న నోట్స్ కంప్యూటర్ లో టైపు చేసి భద్రము చేయండి