Skip to content
Verse Wise BIBLE Study Method
- మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న వచనములు ఎంచుకొనండి
- 3-5 వచనములకు మించకుండా చూసుకొనండి. ఒకవేళ ఒక వచనములో ద్యానించుటకు ఎక్కువ సమాచారము ఉన్న యెడల ఒక్క వచనము అయినా చాలు
- మీరు ఎంచుకున్న వచనముల యొక్క అధ్యాయము గురించి మీకు కనీస అవగాహన ఉంటే మంచిది
- 5-10 సార్లు ఆ వచనములను చదవండి
- వచనములలో ప్రస్తావించబడిన విషయము వ్రాయండి
- వచనములు అధ్యాయము యొక్క సందర్భమునకు ఎలాంటి సంబంధము కలిగియున్నాయో చూడండి
- వచనములు అధ్యాయము యొక్క ఉద్దేశ్యమునకు ఎలాంటి సంబంధము కలిగియున్నాయో చూడండి
- ప్రతి వచనమునకు క్రాస్ రిఫరెన్స్ వెతికి వాటిని కూడా స్టడీ చెయ్యండి
- మీకు ఉన్న జ్ఞానమును బట్టి ఆ వచనములలోని దృశ్యమును ఊహించటానికి ప్రయత్నము చేయండి
- వచనములలో ఉపయోగించబడిన ప్రధాన పదములు గుర్తించండి
- ఆ వాక్యములోని పదములను ఒక్కోసారి ఒక్కోటి నొక్కిపట్టి చదవండి. ఆ పదము మీతో ఏమైనా మాట్లాడితే వ్రాసుకొనండి
- ఆ వచనముల యొక్క సారాంశము క్లుప్తముగా మీ స్వంత పదములతో వ్రాయండి
- అన్ని కోణములలోను ఆ సంఘటనను విశ్లేషించండి
- వ్యక్తుల వైపు నుంచి
- 3వ వ్యక్తిగా
- దేవుని కోణము నుంచి
- మీరు స్టడీ చేసిన తరువాత గ్రహించిన అంశములను విపులముగా వ్రాయండి. క్లుప్తముగా వ్రాయవద్దు
- మీరు గ్రహించిన అంశములను మీ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలో చూడండి
- వాటి నిమిత్తము ప్రణాళిక సిద్దము చెయ్యండి
- వచనములను స్టడీ చేస్తున్నపుడు ఈ క్రింది విషయము గమనించండి
- ఒప్పుకుని విడిచిపెట్టవలసిన పాపము ఏమైనా ఉన్నాదా? అది ఏమిటి?
- ఆ పాపము నుండి విడుదల ఎలా పొందాలి?
- ఆ పాపము వలన ఎవరిని అయినా నొప్పించారా? అయితే క్షమాపణ అడగండి
- ఆ పాపము వలన ఎవరికి అయినా నష్టము కలిగించారా? అయితే దానిని ఎలా భర్తీ చేస్తారు?
- ఆ పాపమునకు దేవుని దగ్గర నుండి ఎలా పరిహారము, క్షమాపణ పొందాలి?
- ఏదైనా వాగ్ధానము ఉన్నదా?
- అది షరతులతో కూడిన వాగ్దానమా? షరతులు లేనిదా?
- ఆ షరతులు మీరు కలిగి ఉన్నారా?
- ఈ వాగ్ధానము ఏ సందర్భములో ఉపయోగించుకొనవచ్చు?
- ఈ వాగ్ధానము ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ప్రజలకు ఇవ్వబడినదా?
- వాగ్ధానము విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
- వ్యక్తిత్వము పరముగా మార్చుకొనవలసినది ఏమైనా ఉన్నదా?
- అది మంచి లక్షణము అయితే అది మీలో ఎదిగేలా ఏమి చెయ్యాలి?
- అది చెడ్డ లక్షణము అయితే మీలో నుంచి పోయేలా ఏమి చెయ్యాలి?
- పాటించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా?
- ఆ ఆజ్ఞను పాటించే విషయము
- మీకు నష్టము కలిగినా పాటించటానికి సిద్దమనస్సు కలిగి ఉన్నారా?
- లాభసాటిగా ఉన్నంతవరకే పాటిస్తారా?
- మీ మనస్సునకు నచ్చితేనే పాటిస్తారా?
- దేవుడు చెప్పాడు కాబట్టి ఎలా అయినా సరే పాటిస్తారా?
- మీరు అనుకరించదగిన మాదిరి ఏమైనా ఉన్నదా?
- హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా?
- శాపములు ఏమైనా ఉన్నాయా?
- జాగ్రత్త పడవలసిన విషయములు ఏమైనా ఉన్నాయా?
- ఆ తప్పులలో పడిపోకుండా ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి?
- విశ్వసించవలసినది ఏమైనా ఉన్నదా?
- దేవుని గురించి తెలిసికొనుటకు ఏదైనా విషయము కలదా?
- తండ్రి గురించి
- కుమారుడైన క్రీస్తు గురించి
- పరిశుద్దాత్మ దేవుని గురించి
- దేవదూతల గురించి ఏమైనా విషయములు చెప్పబడినవా?
- సాతాను, వాడి దూతల గురించి ఏమైనా చెప్పబడినదా?
- దేవుని శతృవులు గురించి ఏమైనా విషయములు కలవా?
- భక్తిహీనులు, దుర్మార్గుల గురించి ఏమైనా విషయము ఉన్నదా?
- పరిశుద్ద గ్రంధము నందలి ఏదైనా వేరే విషయము తెలిసికొనుటకు ఈ వచనములు ఉపకరిస్తాయా?
- దేవునికి ప్రార్ధన చేయుటకు అంశములు ఏమైనా ఉన్నాయా?
- దేవుని స్తుతించుటకు ఏమైనా అంశములు కలవా?
- దేవుని ఆరాదించుటకు ఏమైనా అంశములు కలవా?
- దేవునికి కృతజ్ఞత కలిగిఉండేలా ఏమైనా అంశములు కలవా?
- వచనములలో కాలము గురించి ఏమైనా చెప్పబడినదా?
- వచనములలో ఏవైనా పోల్చి చెప్పటము జరిగినదా?
- వచనములలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు ఎవరు?
- వారి పేరులకు గల అర్ధము ఏమిటి?
- ఆ వ్యక్తులు ఎలాంటివారు?
- ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు?
- ఈ మాటలు ఎవరైనా 3వ వ్యక్తి గురించి చెప్పబడినవా?
- ఈ వచనములలో ఉన్న విషయములు ఏ కాలములో జరిగాయి?
- ఈ వచనములలో ఉన్న విషయములు ఎక్కడ జరిగాయి?
- ఆ ప్రదేశము యొక్క పేరు ఇప్పుడు ఏమిటి? అది ఎక్కడ ఉన్నది?
- ప్రదేశము యొక్క పేరునకు అర్ధము ఏమిటి?
- ఆ ప్రదేశమునకు పరిశుద్ద గ్రంధములో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా?
- ఈ వచనములలో ఉన్న విషయములు జరగటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
- ఆ పరిస్థితులు దేవుని చిత్తము వల కలిగినవా? మనుష్యుల వలన వచ్చినవా?
- ప్రవచనము ఏదైనా ఉంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది?
- ఈ వచనములను ఇంగ్లీషు బైబిలులోని వివిధ తర్జుమాలలో చదివి చూడండి. ఇంకా ఏమైనా క్రొత్త సంగతులు గ్రహించగలరేమో చూడండి?
- ఏవైనా వ్యాఖ్యానములు రిఫర్ చేసి క్రొత్త విషయములు కనుగొనగలరేమో ప్రయత్నించండి
- దేవుడు ఇంకా ఏవైనా క్రొత్త సంగతులు చెప్తారేమో చివరిలో మరలా పార్ధన చేసి కనిపెట్టండి
admin2022-01-10T15:00:39+05:30
Share This Story, Choose Your Platform!
Page load link