- ఇది ఒక తండ్రి తన కుమారునికి, ఒక భర్త తనకు కాబోయే భార్యకు వ్రాసిన ప్రేమలేఖయై ఉన్నది
- ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలిసికొనుటకు
- క్రైస్తవ జీవితము అనేది ఆచారములు పాటించేది కాదు. దేవుని యొక్క వాక్యానుసారము జీవించవలసినదై ఉన్నది
- ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగు రక్షణ పొందుకొనుటకు
- అద్యాత్మికముగా ఎదుగుటకు
- దేవుడు అప్పచెప్పిన పని నెరవేర్చుటకు తగిన శక్తి, జ్ఞానము, సామర్ధ్యము పొందుకొనుటకు
- ప్రభువైన యేసుక్రీస్తునకు శిష్యులుగా మారుటకు
- మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతిమాట వలన జీవించును అని పరిశుద్ద గ్రంధము సెలవిస్తుంది
- ఆయన వాక్యము మనము అనుదినము నడువవలసిన త్రోవను బోధిస్తుంది
- మనము ఆయన మార్గము తప్పి ప్రవర్తించినపుడు గద్దిస్తుంది
- మనము మరలా అయన మార్గములోనికి తిరిగి చేరుటకు మనలను సరిదిద్దుతుంది
- మనము ఆయన మార్గములో క్రమము తప్పకుండా నడుచుటకు తర్పీదునిస్తుంది
- సత్యము మనలను స్వతంతృలుగా చేస్తుంది
- వాక్యము ఈ రూపములో మన చేతులలోనికి రావటానికి చాలా మంది ఎన్నో త్యాగములు చేసారు. వారి ప్రాణములు సహితము ధారపోశారు
- మనకు వాక్యము తెలియకపోతే తప్పుడు బోధలచేత మోసపోయి, ఈడ్వబడే ప్రమాదము ఉంది
- దేవుడు కోరుకున్న వ్యక్తిగా జీవించటానికి మారదర్శినిగా పనిచేస్తుంది
- దేవుడు మనకొరకు చేసినదానిని మనము నాశనము చేసుకోకుండా, వదులుకోకుండా కాపాడుతుంది
- మన వ్యక్తిత్వములోని లోటుపాట్లను సరిచేసుకోవటానికి ఉపయోగపడుతుంది
- మనిషి జీవనప్రమాణములు ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది
- పాపములో పడిపోకుండా సాతాను యొక్క కుతంత్రములను తప్పించుకోవటానికి వివేచన, వివేకము, వాగ్దానములు దయచేస్తుంది
- మనము ప్రతిరోజూ నడువవలసిన త్రోవను తెలియజేస్తుంది
- మన జీవితము పట్ల దేవుని ప్రణాళిక/చిత్తము తెలిసికొనుటకు ఉపయోగపడుతుంది
- మనలను నిత్యజీవములోనికి నడిపిస్తుంది
- దేవుడు ఏర్పాటు చేసిన జీవము అనుదినము పొందుకొనుటకు
- ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము లోనికి మారుటకు. (ఆయన వ్యక్తిత్వము, ఆలోచన, మాటతీరు, చేతలు, విలువలు)
- మన మార్గము దేవుని పద్దతిలో వర్దిల్లజేసికొనుటకు ఉపకరిస్తుంది