మొదటి 11 అధ్యాయములు 2000 సంవత్సరముల చరిత్రను కలిగిఉన్నది
చివరి 39 అధ్యాయములు 350 సంవత్సరముల చరిత్రను కలిగిఉన్నది
ఆదికాండమునందలి సంఘటనలు మోషే పుట్టుకకు 3 దశాబ్దముల ముందు జరిగినవి
బైబిలునందు 4,100 సంవత్సరముల చరిత్ర కలదు. అందులో సగము 2,286 సంవత్సరములు ఆదికాండమునందు కలదు. మిగిలిన 1,814 సంవత్సరముల చరిత్ర నిర్గమకాండమునుంచి ప్రకటన గ్రంధము వరకు కలదు (65 పుస్తకములు).
1-11 అధ్యాయములలో దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఎన్నుకున్నారు అనేది వివరించబడినది.
12-50 అధ్యాయములలో దేవుడు ఇశ్రాయేలును ఎలా ఎన్నుకున్నారు అనేది వివరించబడినది.
ఆదికాండము అన్నీఎలా మొదలయ్యాయి అనే దానికి సంబంధము కలిగి ఉన్నది.
ఈ గ్రంధమునందు మొత్తము 10 వంశావలులు కలవు
ఈ ఒక్క గ్రంధమునందు మాత్రమే దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు వివరించబడినది (2:2, 3).
మెస్సీయ రాకడ గురించి, ఆయన శ్రమ గురించి, అంతిమ విజయము గురించిన మొదటి ప్రవచనము ఇందులో వివరించబడినది (3:15).
ఆదికాండము నూతన నిబంధనలో 200 సార్లకు పైగా ఉదహరించబడినది.
1-11 అధ్యాయములు నూతన నిబంధనలో 100 సార్లకు పైగా ఉదహరించబడినవి.
ప్రస్తుత కాలము యొక్క యాత్రికులకు వారి ప్రయాణములలో నిశ్చయత ఇస్తుంది