- దేవుడు అనే పదముతోనే ఆదికాండము మొదలవుతుంది
- ఆదికాండము అనగా ప్రారంభములు లేదా మూలములు అని అర్దము
- ఇది సృష్టిచేయుటయందు దేవుని యొక్క ఉద్దేశ్యము మరియు ప్రణాళిక గురించిన కధనము
- ఆదికాండము బైబిలు మొత్తమునకు వేదిక సిద్దము చేస్తుంది
- ప్రపంచము, మానవుల చరిత్ర, కుటుంబములు, నాగరికతలు, రక్షణ గురించిన ప్రారంభములను విశదీకరిస్తుంది
- ఈ క్రింది వాటిని ప్రత్యక్షపరుస్తుంది
- వ్యక్తిగా దేవుడు మరియు ఆయన గుణగణములు (సృష్టికర్త, కాపాడువాడు, న్యాయాధిపతి, విడిపించువాడు)
- మానవుల యొక్క విలువ మరియు గౌరవము (దేవుని యొక్క పోలికలో చేయబడుట, కృప చేత రక్షింపబడుట, లోకములో దేవునిచేత వాడుకొనబడుట)
- పాపము యొక్క విషాదాంతము, దాని ఫలితములు (పడిపోవుట, దేవునికి దూరమవుట, తీర్పు)
- రక్షణ యొక్క వాగ్ధానము మరియు నిశ్చయత (నిబంధన, క్షమాపణ, వాగ్ధానము చేయబడిన రక్షకుడు).
- దేవుడు తన స్వరూపము, పోలికెలో మొదటి మానవులను చేయుట ద్వారా అద్భుతముగా ఆదికాండము మొదలవుతుంది
- ఎక్కువకాలము గడవకముందే సాతాను ముసుకు తొలగించబడి పాపము లోకములోనికి ప్రవేశించింది
- ఆదాము, హవ్వ అతిక్రమము ద్వారాసృష్టిమొత్తము చెదరగొట్టబడినది.
- దేవునికి మానవులకు మధ్యసంబంధము తెగిపోయి, పాపము ప్రజ్వరిల్లినది
- నోవహు అతని కుటుంబము తప్పమిగిలిన మనుష్యులు అంతా దేవుని తీర్పులో మరణించారు
- దేవుడు అబ్రహామును పిలచుట ద్వారా నిబంధన జనాంగము ఏర్పరచబడినది
- అబ్రహాము సంతానమునుంచే దేవుడు లోకమునకు రక్షణ, ఆశీర్వాదము కలుగజేసినారు
- ఇస్సాకు, యాకోబు, యోసేపుల ద్వారా నిబంధన కొనసాగినది
- యాకోబు 12 మంది కుమారులనుంచి 12 ఇశ్రాయేలు గోత్రములు ఉద్భవించినాయి
- యోసేపు ఇగుప్తు రాజగుట ద్వారా దేవుడు తన ప్రజలను కరువునుంచి రక్షించారు
- దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట నెరవేరునట్లు యాకోబు కుటుంబము ఇగుప్తులో స్థిరపడుటకు దేవుడు యోసేపును సాధనముగా వాడుకొనెను
- అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల జీవితగాధలు దేవుని యొక్క వాగ్ధానములు మరియు ఆయన యొక్క నమ్మకత్వమునకు రుజువులుగా ఉన్నవి.
- ఆదికాండములో మనము కలుసుకొనే ప్రజలు సామాన్యులు, సాధారణమైన వారు అయినప్పటికి దేవుడు వారిచేత గొప్పకార్యములు చేయించినారు.
- జీవవృక్షము ఆదికాండములో పోగొట్టుకొనబడి ప్రకటన 22లో పునరుద్దరించబడినది
- భవిష్యత్తులో మెస్సీయ వచ్చే యూదా గోత్రమును యాకోబు దీవించుటతో ఆదికాండము ముగుస్తుంది
- యేసుక్రీస్తు ప్రభువులో ఈ ప్రవచనము నెరవేరకమునుపు అనేక దశాబ్ధముల పాటు అనేక పోరాటములు ఎదుర్కొనవలసి వచ్చినది.
- ఆదికాండము చదివి ప్రోత్సాహము పొందండి
- మనకు నిరీక్షణ ఉన్నది. ప్రపంచము యొక్క స్థితి ఎంత అంధకారములో ఉన్నప్పటికీ దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు.
- నీవు ఎంత పనికిరానివాడను, నా వలన ఉపయోగము లేదు అనుకున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రణాళికలో నిన్ను వాడుకోవాలి అని ఆశ కలిగిఉన్నాడు.
- నువ్వు ఎంత పాపాత్ముడవు అయినా, దేవునికి ఎంత దూరముగా జరిగినా కూడా ఆయన రక్షణ నీకు అందుబాటులో ఉన్నది.
- ఆదికాండము చాలా విధములుగా నూతన నిబంధనను ముందుగానే గ్రహించినట్లు కనిపిస్తుంది
- త్రిత్వము, దేవుని యొక్క వ్యక్తిత్వము
- వివాహ వ్యవస్థ
- పాపము యొక్క తీవ్రత
- దైవిక తీర్పు
- విశ్వాసము ద్వారాకలుగు నీతి
దేవుడు ఎక్కడకు దారితీస్తాడో — ఆయన పోషిస్తాడు!
దేవుడు ఎక్కడకు మార్గదర్శకము చూపిస్తాడో — ఆయన అందజేస్తాడు!
దేవుడు ఎక్కడకు నిర్దేశిస్తాడో — ఆయన కాపాడుతాడు!