- దేవుడు సృష్టికర్త. ఆయనే ఈ సమస్త విశ్వమును శూన్యము నుంచి సృజించారు. మనుష్యులవలే దేవునికి ఏదైనా తయారుచేయటానికి ముడిపదార్థము అవసరము లేదు. ఆయన దేనిని అయినా సృజించగలరు (1:1)
- దేవుడు ఆదినుంచి ఉన్నవాడు. ఆయన కాలమునకు అతీతుడు. ఆయనకు ఆది, అంతము లేదు (1:1)
- దేవుడు సర్వ శక్తిమంతుడు (1:1)
- దేవుడే సమస్త జ్ఞానమునకు, తెలివికి ఆధారము (1:1)
- దేవుడు సమస్తమును ఒక నిర్దిష్ట ప్రణాళికను అనుసరించి తయారుచేశారు (1వ అధ్యాయము)
- తన సృష్టిలోని జీవులు ఉపయోగించుకొను సమస్తమును ఆయన వాటిని తయారుచేయటానికి ముందుగానే సిద్దపరిచారు (1వ అధ్యాయము)
- దేవుడు తను చేసిన పనిని పరీక్షిస్తారు (1వ అధ్యాయము)
- దేవుడు వెలుగును, చీకటిని, పర సంబంధమైన వాటిని, భూసంబంధమైన వాటిని వేరు పరిచారు (1:4, 7)
- దేవుడు చేసిన ప్రతిది కూడా ఒక ఉద్దేశ్యము ప్రకారము, దానికొరకు ఒక పని యోచించి తయారుచేశారు (1వ అధ్యాయము)
- దేవుడు చేసిన సమస్తము మీద ఆయన వెలుగును ప్రసరింపచేసారు. ఒక్క నరకము తప్ప మరి ఏ ప్రదేశమును ఆయన వెలుగు లేకుండా విడిచిపెట్టలేదు (1వ అధ్యాయము)
- దేవుడు ప్రతి పనిని మంచిగాను సమస్తమును కలిపి చాలామంచిగా చేసారు (1వ అధ్యాయము)
- ఆయన ఎప్పటికీ చెడు చేయరు. ఆయన ఆలోచనలలో, క్రియలలో, ప్రణాళికలో చెడుకు స్థానము లేదు (1వ అధ్యాయము)
- దేవుడే సమస్త జీవమునకు ఆధారము (1:20)
- దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు = తండ్రి + కుమారుడు + పరిశుద్దాత్ముడు (1:1)
- దేవుడు జీవమును ఆశీర్వదించువాడు (1:22, 28)
- దేవుడు భూమ్యాకాశములను సృజించినపుడు అన్నింటిని అత్యుత్తమముగా రూపొందించారు (1వ అధ్యాయము)
- దేవుడు తన స్వరూపము, పోలికెలో నరులను సృజించారు. సృష్టిలో మరిదేనికిని ఈ అదృష్టము లేదు (1:26, 27)
- దేవుడు సమస్తమును కూడా తన నోటి మాట ద్వారా చేసారు. ఆయన వాక్కునకు అంత శక్తి ఉంది (1వ అధ్యాయము)
- దేవుడు తన పనులను అస్తమయము కన్నా(చీకటి) ఉదయముతోనే (వెలుగుతో) ముగించారు (1:5, 8, 13, 19, 23, 31)
- దేవుడు నరులను మాత్రమే తన స్వహస్తములతో చేశారు (2:7)
- దేవుడు నరులను స్త్రీ మరియు పురుషులుగా తయారుచేశారు (1:27)
- దేవుడు నరులకు తన చేతిపనులు అన్నింటిమీద అధికారము ఇచ్చారు (1:26, 28)
- దేవుడు జీవాత్మను నరులకు దయచేశారు (2:7)
- దేవుడు తన సృష్టిలోని జీవులకు ఆహారము దయచేశారు (1:29, 30)
- దేవుడు చేసిన పనులు అన్నీ నిత్యత్వ పర్యంతము నిలిచి ఉంటాయి. అవి కాలముతో తరిగిపోయేవి కావు (1వ అధ్యాయము)
- దేవుడే ఆదాము, హవ్వకు పేరెంట్ గా ఉన్నారు
- దేవుడే భూమిమీద వర్షమును నియంత్రించును (2:5)
- దేవుడు మానవులు చెడును గురించిన జ్ఞానము కలిగియుండాలి అని కోరుకోలేదు (2:17)
- దేవుడు 7వ దినమును పరిశుద్దపరచి ఆశీర్వదించినట్లు మనము కూడా వారములో ఒకరోజు పూర్తిగా దేవునితో గడపాలి (2:2, 3)
- మనము ఆయన ఆజ్ఞలు, కట్టడలు పాటించాలి అని దేవుడు కోరుకుంటారు (2:17)
- దేవుడు తను అనుకున్న పని పూర్తి చేసేవరకు విశ్రమించలేదు (2:2)
- దేవుడు మానవుని ఆత్మ, ప్రాణము, దేహము కలవానిగా చేశారు (2:7)
- మనిషి తనకు అప్పగించిన భాద్యతను నెరవేర్చటానికి అవసరమైన అన్ని వనరులు దేవుడు సమకూర్చారు (2:8-10)
- మనిషి అడగకముందే దేవుడు తన అవసరతను ఎరిగి దానిని సంపూర్తి చేశారు (2:18)
- దేవుడే మొట్టమొదటి వైద్యపరమైన ఆపరేషన్ చేశారు (2:21)
- దేవుడు మనుషులు కుటుంబములుగా జీవించాలి అని కోరుకున్నారు (2:24)
- మనుషులు పాపము లేకుండా జీవించాలి అనేది దేవుని అభీష్టము (2:25)
- దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు (2:24)
- దేవుడు పాపమును సహించరు (3, 4, 6, 19 అధ్యాయములు)
- దేవుడు పాపమునకు తీర్పు తీర్చి శిక్ష విధిస్తారు (3, 4, 6, 19 అధ్యాయములు)
- మానవుడు తను చేసిన పాపము విషయమై పశ్చాత్తాప పడటానికి దేవుడు అవకాశము ఇస్తారు. జంతువులకు అవకాశము లేదు (3:11, 13)
- దేవుడు తిరుగుబాటును సహించరు (3:17, 4:11)
- దేవుడు క్రమశిక్షణ ద్వారా మనలను రక్షించాలి అని కోరుకుంటారు, మనలను శిక్షించటము ఆయనకు ఇష్టము ఉండదు (3:21, 22; 4:15; 17:1; యాకోబు, అతని కుమారులు)
- దేవుడే ఆదాము, హవ్వల తరుపున బాలి అర్పించి వారి పాపమునకు ప్రాయశ్చిత్తము చేశారు (3:21)
- దేవుడు మనలో ఉన్న పాప స్వభావమును అసహ్యించుకుంటారు తప్ప మనలను కాదు (3:21, 22)
- దేవుడు చాలా దయ కలిగినవాడు. ఆదాము, హవ్వలను వెల్లగోట్టిన తరువాత కూడా వారితో సహవాసములో ఉన్నారు (4, 5 అధ్యాయములు)
- మానవులు ఈ లోకములో తమ పనులు చేసుకుని బ్రతకటానికి దేవుడే సహాయము చేస్తున్నారు (ఆదికాండము)
- ఆదాము, హవ్వలు తను ఇచ్చిన మాట మీరినా కూడా తాను వారికి ఇచ్చిన ఆశీర్వాదము విషయమై దేవుడు నమ్మకత్వము కలిగి ఉన్నారు (4వ అధ్యాయము)
- దేవుడు మనలను కోరుకుంటారు తప్ప మనము ఇచ్చే బహుమానములు కాదు (4:4, 5)
- మనము పాపము వలన మరింత ప్రమాదములో పడిపోకుండా దేవుడు మనలను హెచ్చరిస్తారు (4:6, 7)
- దేవుడు పాపిని ప్రేమించి అతను మారటానికి దీర్ఘశాంతముతో చాలా అవకాశములు ఇస్తారు (6:3)
- దేవుడు జలప్రళయమునకు ముందు మనుషులకు దీర్ఘాయువు దయచేశారు (5వ అధ్యాయము)
- దేవుడు నీతిమంతుని తరుపున వాదించును (4:10, 11)
- దేవుడు నీతిమంతుల కొరకు భూమిమీద ఎల్లప్పుడూ చూచును (5:24; 6:8, 9)
- దేవుడు నీతిమంతులతో సహవాసము, సంబంధము కలిగియుండును (5:24; 6:9)
- దేవుడు నీతిమంతుల సహవాసము నందు ఆనందించును, సంతోషించును (5:24)
- మానవులు తనతో సహవాసము, సంబంధము కలిగియుండటానికి దేవుడు ఎల్లప్పుడూ ద్వారము తీసే ఉంచారు (6:3; 7:16)
- దేవుడు పాపమును ఎప్పుడూ తేలికగా తీసుకొనరు (7:21, 22; 19:24, 25)
- దేవుడు నీతిమంతులను ఎల్లప్పుడూ రక్షించును (7:23; 19:29)
- నాశనము తప్పించుకొనుటకు దేవుడే నీతిమంతులకు దారి చూపించును (6:14)
- దేవుడు నీతిమంతులకు అప్పగించిన పనిని వారు సంపూర్ణము చేయునట్లు అవసరమైన శక్తి, జ్ఞానము వారికి దయచేయును (6:22; 7:5; 12:4)
- దేవుడు జలప్రళయము రాకముందు ఆఖరి నిముషము వరకు కూడా ప్రజలకు అవకాశము ఇచ్చారు (7:16)
- నీతిమంతులు పాపములో పడకుండా దేవుడు వారిని రక్షించును
- తనకు విధేయత కలిగియున్న మనుషులను దేవుడు కాపాడును (నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
- దేవుడు నీతిమంతులతో నిబంధన చేయును (నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు)
- దేవుడు తన ప్రణాలికలు నెరవేర్చు మనుష్యుని కొరకు ఓపికతో ఎదురుచూచును (12:1-3 అబ్రహాము)
- దేవుడు మన నాశనము చూసి ఎప్పుడూ సంతోషించరు (8:21)
- దేవుడు తన ప్రజల తరుపున పోరాడును (12:17; 20:3; 35:5)
- దేవుడు మన విధేయతను పరీక్షించును (22:2)
- తనతో చేసిన నిబంధన నెరవేర్చే దిశగా దేవుడు మనలను నడిపించును. ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేయును (35:1)
- మనము విధేయత చూపిన కొలది దేవుడు మనలను ఆశీర్వదించును (అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
- దేవుడు మన శత్రువులను హెచ్చరించును (31:24)
- దేవుడు తన ప్రజలను క్రమశిక్షణ చేసి వారిని రక్షించును (17:1; యాకోబు; యాకోబు కుమారులు)
- తన ప్రజలు అయినా సరే దేవుడు పాపమును పరిహరించరు
- దేవుడు మాట విని లోబడని ప్రజలు శిక్ష ఎదుర్కొంటారు (19:26)
- దేవుడు మన కష్టములను, దుఃఖమును చూసి అర్ధము చేసికొనును (అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
- దేవుడు తన ప్రజల సంరక్షణ నిమిత్తము తన దూతలను పంపును (32:1)
- దేవుడు తాను ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చే విషయమై ఎప్పుడూ విశ్వసనీయత కలిగియుంటారు (నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
- మనము దేవుని మీద అధారపడినపుడు దేవుడు మనకు తగిన భాగస్వాములను దయచేస్తారు (నోవహు, అతని భార్య, హానోకు, అతని భార్య, ఎలియాజరు, ఇస్సాకు, రిబ్కా, అబ్రహాము, శారా, ఆసెనతు, యోసేపు)
- దేవుడు మనుషులను వారి పైరూపము చూసి కాక హృదయమును చూసి ఏర్పాటు చేసుకుంటారు (హేబెలు, హానోకు, నోవహు, యాకోబు, యోసేపు)
- దేవుడు అధికారుల దగ్గర తన ప్రజలకు అనుకూలత చూపిస్తారు (యోసేపు)
- దేవుడు తన ప్రజలను దీవించుటకు అన్యజనులను వాడుకుంటారు (ఫరో)
- దేవుడు మనకు ఎప్పుడూ నష్టము కలిగించరు. మనము ఆయన కొరకు పోగొట్టుకొన్న దానికి రెట్టింపు దయచేస్తారు (అబ్రహాము)
- దేవుడు తన ప్రజలు దుర్మార్గత, పాపము నుంచి తొలగి రూపాంతరము చెందాలి అని కోరుకుంటారు (యాకోబు, అతని కుమారులు)
- మనము పెట్టుకున్న ఒట్టులు నెరవేర్చాలి అని దేవుడు ఆశిస్తారు (యాకోబు)
- దేవుడు మన శత్రువులు మన ముందు వంగేలా చేస్తారు (అబీమెలెకు, ఫరో, లాబాను)
- దేవుడు తన ప్రజలతో కలలు, దర్శనముల ద్వారా మాట్లాడతారు (అబ్రహాము, యాకోబు, యోసేపు)
- తన ప్రజల పట్ల యోచించబడిన, చేయబడిన కీడును దేవుడు వారికి మేలుగా మారుస్తారు (యోసేపు)
- దేవుడు తన సొంత కుమారుని దహనబలిగా దయచేశారు (అబ్రహము మోరియా పర్వతము మీద)
- దేవుడు మన శత్రువుల మీద మనకు విజయము దయచేస్తారు (అబ్రహాము, 5గురు రాజులు)
- పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము
- దేవుడు ఒకసారి మనలను పిలిచిన తరువాత ఆయన వెనుకడుగు వేయరు. మన పిలుపు విషయములో పశ్చాత్తాప పడరు (అబ్రహాము, యాకోబు)
- దేవుడు తన నామముల ద్వారా తన వ్యక్తిత్వము గురించి బయలుపరచారు
- దేవుడు తను చేయబోవు కార్యముల గురించి తనకు విశ్వాస్యత కలిగిన వారికి తెలియజేస్తారు (అబ్రహాము, సోదోమ, గొమేర్రా గురించి)
- దేవుడు తన నిబంధన ప్రజలతో సహవాసము కలిగిన అన్య జనులను కూడా కాపాడతారు, రక్షిస్తారు (ఎలియాజరు, హాగరు)
- దేవుడు మన శత్రువులను మనకు మిత్రులుగా చేస్తారు (33:4)
- మనము దేవునికి లోబడినపుడు మన శత్రువులను ఆయన గద్దిస్తారు (35:5)
- దేవుడు తన విశ్వాసులకు నెమ్మది కలిగిన మరణము దయచేయును (అబ్రహాము, శారా, యాకోబు, యోసేపు, దెబోరా)
- వారి యొక్క పిలుపును బట్టి దేవుడు తన ప్రజల పేరులను మారుస్తారు (అబ్రహాము, శారా, యాకోబు)
- దేవుడు తన ప్రజలు తన నిబంధనకు సంబందించిన గురుతు కలిగియుండాలి అని కోరుకుంటారు (సున్నతి)
- ప్రకృతి పరమైన నియమములను తృణీకరించే విధముగా దేవుని అద్భుతములు ఉంటాయి (శారా బిడ్డకు జన్మ ఇచ్చుట)
- దేవుడు తన ప్రజలతో మాట్లాడేటపుడు ఒకోసారి శరీరదారిగా వస్తారు (18:1)
- దేవుడు తనను నమ్ముకున్న వారి యొక్క పరపతిని బట్టి కాకుండా వారి స్థితి ఎలా ఉన్నా వారి ప్రార్థన ఆలకిస్తారు (ఎలియాజరు)