ఆదికాండములో క్రీస్తు స్త్రీ సంతానముగా కనిపించును

ఆయన సాతానును జయించును

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను. (3:15)

ఆయన తననుతాను బలిగా అర్పించుకుని మరణమునుంచి తిరిగిలేచును

అప్పుడాయన నీకు ఒక్కడైయున్ననీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను (22:2)

ఆయన ద్వారా సమస్తదేశములు అశీర్వదించబడును

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. (22:18)

ఆయన తన ప్రజలను పరిపాలించును

షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్లమధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు .(49:10)

ఆయన న్యాయాదిపతిగా ఉండి పాపమునకు తీర్పుతీర్చును

ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును (49:11)

అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును (49:12)

మెల్కీసెదేకు

14వ అధ్యాయములో రాజు మరియు యాజకుడైన మెల్కీసెదెకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము ప్రకారము మన ప్రదానయాజకుడు, ప్రభువునైన యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాడు

ఆదినుంచి ఉన్నవాడు

యోహాను 1:1ని బట్టిఆదికాండము 1వ అధ్యాయములోని సృష్టిక్రమములో ఆయన పాలిభాగస్థుడై ఉన్నాడు.

దేవుని వాగ్దానములకు నెరవేర్పు

దేవుడు అబ్రహామునకు 15, 17 అధ్యాయములలో చేసిన గొప్పవాగ్దానములకు, నిబంధన నెరవేర్పునకు ప్రత్యక్షరూపమే ప్రభువైన యేసుక్రీస్తువారు. ఈ విషయము గురించి పౌలు గలతీ పత్రికలో విపులముగా వివరించటము చూడగలము

విధేయత కలిగిన కుమారుడు

22వ అధ్యాయములో తన తండ్రి మాటకు విధేయుడై మరణమునకు, బలియాగము అవటానికి సిద్దపడిన ఇస్సాకు కూడా ప్రభువైన యేసుక్రీస్తువారికి సాదృశ్యము

యోసేపు జీవితము ద్వారా

యోసేపు జీవితములో జరిగిన కొన్నిసంఘటనలు ప్రభువైన యేసుక్రీస్తువారు ఈ లోకములో శరీరముతో జీవించిన 33.5 సంవత్సరముల కాలములో జరిగిన సంఘటనలకు చాలా దగ్గర సంబంధము కలిగియున్నాయి

త్రిత్వము ద్వారా

1, 3, 11 అధ్యాయములలో ఉపయోగించబడిన “మనము” అనే మాటలో ప్రభువైన యేసుక్రీస్తువారిని చూడగలము