బైబిలు రిఫరెన్స్
బైబిలు 66 పుస్తకముల సముదాయము. సులువుగా గుర్తించుటకు, అర్ధము చేసికొనుటకు, బైబిలునందు గల ప్రతి పుస్తకము అధ్యాయములు, వచనముల క్రింద విభజించబడినది. బైబిలునందు గల నిర్ధిష్టమైన విభాగమును సూచించుటకు ఉపయోగించే పద్దతినే బైబిలు రిఫరెన్స్ అంటారు. వివిధ రిఫరెన్స్ నమూనాలను ఇక్కడ ఉదహరించటము జరిగినది. పుస్తకము యొక్క పూర్తిపేరు బదులు చాలాసార్లు పుస్తకము యొక్క సంక్షిప్త నామము ఉపయోగిస్తారు. బైబిలు పుస్తకముల యొక్క సంక్షిప్త నామముల కొరకు పుస్తకముల సంక్షిప్త నామములు అనే ఆర్టికల్ చూడగలరు.
1. ఏదేని వచనము.
బైబిలునందు గల ఏదైనా ఒక వచనమును సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి ఈ క్రింది నమూనాను కలిగి ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>
ఉదా: ఆదికాండము 3:15
ఆదికాండము పుస్తకమునందు 3 వ అధ్యాయములోని 15 వ వచనము అని అర్ధము.
2. వరుస వచనములు
ఏదైనా ఒక అధ్యాయమునుండి ఒకటికంటే ఎక్కువ వచనములు వరుసగా సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<ప్రారంభ వచనము సంఖ్య>-<ముగింపు వచనము సంఖ్య>
ఉదా: కీర్తనలు 119:10-15
కీర్తనలు పుస్తకమునందు 119 వ అధ్యాయములో 10 వ వచనము నుండి 15 వ వచనము వరకు అని అర్ధము
3. ఎంపిక చేయబడిన వచనములు
ఏదైనా ఒక అధ్యాయము నుండి ఎంపికచేయబడిన వచనములను సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>, <వచనము సంఖ్య>
ఉదా: సామెతలు 3:4, 7, 10
సామెతల పుస్తకమునందు 3 వ అధ్యాయములో 4, 7, 10 వచనములు అని అర్ధము
4. వరుస మరియు ఎంపిక చేయబడిన వచనములు
ఏదైనా ఒక అధ్యాయము నుండి వరుస వచనములు, ఎంపికచేయబడిన వచనములను సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<ప్రారంభ వచనము సంఖ్య>-<ముగింపు వచనము సంఖ్య>, <వచనము సంఖ్య>
ఉదా: నిర్గమకాండము 20:1-5, 11
నిర్గమకాండము పుస్తకమునందు 20 వ అధ్యాయములో 1 నుండి 5 వరకు ఉన్న వచనములు మరియు 11 వ వచనము అని అర్ధము
5. ఒక అధ్యాయము
ఏదైనా ఒక అధ్యాయము సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>
ఉదా: యెషయా 53
యెషయా పుస్తకమునందు 53 వ అధ్యాయము అని అర్ధము
6. బహుళ అధ్యాయములు
ఏదైనా ఒక పుస్తకమునుండి ఒకటి కంటే ఎక్కువ అధ్యాయములు సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>, <అధ్యాయము సంఖ్య>
ఉదా: యెషయా 53, 55
యెషయా పుస్తకమునందు 53 వ మరియు 55 వ అధ్యాయములు అని అర్ధము
7. వరుస అధ్యాయములు
ఏదైనా ఒక పుస్తకమునుండి ఒకటి కంటే ఎక్కువ వరుస అధ్యాయములు సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <ప్రారంభ అధ్యాయము సంఖ్య>-<ముగింపు అధ్యాయము సంఖ్య>
ఉదా: యెషయా 61-63
యెషయా పుస్తకమునందు 61 వ అధ్యాయమునుండి 63 వ అధ్యాయము వరకు అని అర్ధము
8. తరువాతి వచనములు అన్నీ
ఏదేని ఒక అధ్యాయములోని ఒక వచనము తరువాత నుండి అధ్యాయము ముగింపు వరకు గల వచనములు అన్నీ అని సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య> ff
ఉదా: యోహాను 3:10 ff
యోహాను సువార్తనందు 3 వ అధ్యాయములో 10 వ వచనము నుండి అధ్యాయము ఆఖరి వచనము వరకు అని అర్ధము.
9. సంఖ్య కలిగిన పుస్తకములు
బైబిలునందు పుస్తకము యొక్క పేరులో సంఖ్య కలిగిన పుస్తకముల నుండి ఏదేని రిఫరెన్స్ సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<సంఖ్య> <పుస్తకము పేరు>. <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>
ఉదా: 1 సమూయేలు. 10:5
1 సమూయేలు పుస్తకమునందు 10 వ అధ్యాయములోని 5 వ వచనము అని అర్ధము
10. ఒక్కటే అధ్యాయము కలిగిన పుస్తకములు
బైబిలునందు కేవలము ఒక్కటే అధ్యాయము కలిగిన పుస్తకముల నందు గల వచనములను సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <వచనము సంఖ్య>
ఉదా: యూదా 7
యూదా పత్రికనుండి 7వ వచనము అని అర్ధము
11. ఒక అధ్యాయము కంటే ఎక్కువ పరిధి కలిగిన వచనములు
ఒకటికంటే ఎక్కువ అధ్యాయము పరిధి కలిగిన గల వచనములను సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>-<అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>
ఉదా: జెకర్యా 3:5-4:10
జెకర్యా పుస్తకమునుండి 3 వ అధ్యాయములోని 5 వ వచనము నుండి 4 వ అధ్యాయములోని 10 వ వచనము వరకు గల అన్ని వచనములు అని అర్ధము.
12. బహుళ అధ్యాయములు, వచనములు
ఒకటికంటే ఎక్కువ అధ్యాయముల నుండి వచనములను సూచించుటకు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్దతి యొక్క నమూనా క్రింది విధముగా ఉంటుంది.
<పుస్తకము పేరు> <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>; <అధ్యాయము సంఖ్య>:<వచనము సంఖ్య>
ఉదా: హెబ్రీయులకు 2:5; 11:9
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2 వ అధ్యాయములోని 5 వ వచనము మరియు 11 వ అధ్యాయములోని 9 వ వచనము అని అర్ధము.