దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).
స్తుతి
- దేవుడు పేరు ద్వారా మనకు ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు కొరకు
- పేరుల ద్వారా మనము నడవవలసిన త్రోవను, నడవకూడని త్రోవను, పొందుకోవలసిన వాటిని, విడిచిపెట్టవలసిన వాటిని మనకు తెలియజేసినందుకు
- పేరు ద్వారా మనయెడల గొప్ప ప్రణాళిక ఉద్దేశ్యము కలిగి ఉన్నందుకు
- మన నామము ఘనత పొందేలా అన్నిఅవకాశములు ఇచ్చినందుకు
- మన పేరు నశించకూడదు అని సిలువలో శ్రమపడి ఘోర మరణము పొందినందుకు
- మనలను మరిచిపోకుండా మన పేరును తన అరచేతిలో చెక్కుకున్నందుకు
- మన జీవితములను ఉదయపు వెలుగుతో నింపినందుకు
- అస్తమయమందు మన చేతిని పట్టుకుని వెలుగు వచ్చేంతవరకు విడిచిపెట్దనందుకు
- మన జీవితములో ఎలా లెక్కించటము అనేది నేర్పినందుకు
- భూమిని సంపూర్ణముగా చీకటికి అప్పగించనందుకు
- మనతో ఎల్లప్పుడూ సహవాసము చేయాలి అనే ఆయన ఆరాటము కొరకు
ఆరాధన
- మన జీవితమనకు పెట్టిన పేరు సార్ధకము అయ్యేలా ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చి ఆయనను ఆరాధించాలి
- ఆయన మనలను ప్రేమించినట్లుగానే మనము కూడా వెలుగులో ఉండి తిరిగి ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆరాధించాలి
హెచ్చరిక
- మన జీవితములో ఆయన చిత్తమును ఎరిగి దానిని వెంబడించకపోతే మన పేరు నిందకు, ఘనహీనతకు ఆస్పదముగా మారుతుంది
- ఆయనకు సహకరించకపోతే మనము సంపూర్ణత సాధించలేము
- ఆయన ఇచ్చిన సమయములో ఏ రోజు కూడా వృధా చేసుకొనకూడదు
సత్యము
- దేవుని దృష్టిలో మనము అందరము విలువ కలిగినవారము
- భూమిమీద మనుషుల విషయములో ఎలా ఉన్నా ఆయన దగ్గర మనకు ప్రత్యేకమైన unique గుర్తింపు ఉంది
- మనలో వెలుగు సంపూర్ణత సాధించేవరకు ఆయన మొదలుపెట్టిన పనిని ముగించరు
- మనము జీవించే ప్రతి దినము కూడా సరిచేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము, అవకాశము.
- దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు
- మన అందరికీ దేవుని ద్వారా గొప్ప నిరీక్షణ కలదు
- ఆయన ఎప్పుడూ అంధకారములో మనలను విడువడు
- దేవుని దృష్టిలో పేరునకు చాలా విలువ ఉన్నది