దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)
ఈ వచనములలో దేవుని సృష్టి అరవ దినమునకు ఆఖరి దినమునకు చేరుకున్నది. ఇందులో ఆయన జంతువులను మనుష్యులను సృజించటము జరిగినది. ఈ రెండు వచనములలో జంతువులకు సంబంధించిన వివరములు మనకు కనిపిస్తాయి. వాటి వాటి జాతి ప్రకారము దేవుడు మూడు రకములుగా వాటిని సృజించటము జరిగినది. అడవి జంతువులు, పశువులు, ప్రాకు పురుగులు ఇవి అన్నీ కూడా భూమి ద్వారానే పుట్టాయి అని పరిశుద్ధ గ్రంధము మనకు సెలవిస్తుంది. ఈ రెండు వచనముల ద్వారా డార్విన్ జీవపరిణామ సిద్ధాంతము తప్పు అని కూడా మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క జంతువులు మానవుని యొక్క మనుగడ లో ప్రముఖ సహకారం అందించే పాత్ర పోషిస్తున్నాయి. దేవుడు అంగీకరించిన బలుల పట్టికలో పక్షులతోపాటు ,జంతువులు కూడా స్థానము సంపాదించుకున్నాయి. వీటి పోషణ బాధ్యత కూడా దేవుడు తన భుజములమీద వేసుకున్నారు. మనము అందరము కూడా లేఖనములో గొర్రెతో పోల్చ బడ్డాము. వాటి యొక్క జీవన విధానము ద్వారా దేవుడు మనకు కొన్ని విషయములు నేర్పిస్తున్నారు. ఇవి దేవుని చేత ప్రత్యేకముగా ఆశీర్వదించ బడినట్లు ఈ వచనములలో మనకు కనిపించదు. దానికి కారణము సర్పము కావచ్చు .లేదా కేవలము క్రియల వలన మనము రక్షణ పొందలేము అని చెప్పటము అయినా కావచ్చు. satan also compared to lion. వివేకము లేనివి.
దేవుడు చేసిన భుజంతువులలో పశువులకు, మనుష్యులకు మధ్యన విడదీయరాని అవినాభావ సంబంధము ఉన్నది. పశువులు మనకు పాల ద్వారా అనేక పోషకాలను అందిస్తున్నాయి. ఇవి మనుషుల నివాస స్థలములకు సమీపమునే నివాసము ఉంటాయి. అవి తినేది పచ్చగడ్డి అయినా తమ పిల్లలకు, వాటి యజమానులైన మనుష్యులకు శ్రేష్టమైన పాలను అందజేసి వారిని పోషిస్తాయి. ఇవి ఏ విధమైన సుఖము కొరకు ఎంచక వాటికి ఏర్పరచిన స్థలములోనే జీవిస్తాయి. ఇదే విధముగా మనము కూడా శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి ఆయన సంఘమును పోషించాలి. మనము ఎక్కువ సుఖభోగములను అనుభవించుట మిదా దృష్టి పెట్టకూడదు. మన సంతానమునకు కూడా శ్రేష్టమైనది అందజేయాలి. మనము తినేది ఎలా ఉన్నా కానీ లేఖనము మొత్తము మీద మనము గ్రహించునట్లుగా ఆయనకు మాత్రమే శ్రేష్టమైనది అందజేయాలి. దేవుడు సంఘమును పోషించు బాధ్యత మన అందరి మీదన ఉంచారు. ఈ విధముగా మనము దేవుని సేవ జరిగిస్తూ ఉండగా వారికి సహాయము చెయ్యాలి. లేవీయులు ద్వారా దేవుడు మనకు ఈ విషయమును మనకు దృష్టాంతముగా కనపరచారు. మనము దీవెన పొందిన కొలది ఇతరులకు ఆ దీవెన పంచుకోవాలి. క్రొత్త నిబంధనలో చూసినట్లుగా అప్పుడు అందరమూ కొరత అనేది లేకుండా సమృద్ధి కలిగి ఉంటాము. అలాగని ఇంటిని కూడా నిర్లక్ష్యము చేయకూడదు. we need to balance both . దేవుని సేవలో నీవంతు సహకారము నీవు అందిస్తున్నావా?
పశువులు భారములను మోసే పనిలో మనుష్యులకు సహాయము చేస్తాయి. అవి బండి యొక్క కాడిని తన మెడ మీద వేసుకుని బరువులను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు తీసుకుని వెళ్ళటములో సహకరిస్తాయి. ఈ యొక్క క్రమములో వాటి శరీరము బరువు కన్నా ఎక్కువ బరువును అవి లగగలుగుతాయి. మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సూచన అను సరించి ఆయన కాడిని మన భుజములమీద ఎత్తుకోవాలి. ఆయన రాజ్యభారమును మనము కూడా మోయాలి. సువార్త ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతమునకు, భూదిగంతములవరకు వ్యాపించటానికి సహాయము చేయాలి. ఈ ప్రక్రియలో ఒక సారి మనము అధిక భారము మోయవలసి వస్తుంది. చరిత్రలో మనము చూసినప్పుడు కొంతమంది భక్తులు తమ ప్రాణాలను సైతము దీనికొరకు ధారపోసారు. మొదటి ఐదు దినముల సృష్టిలోనూ మన అభివృద్ధి, సిద్ధపాటు గురించి మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఇతరులకు సహాయం చేయటము గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమములో మనము అనేకులము సేవకులుగా మారవలసి ఉన్నది. తమ యజమాని కొరకు అవి శ్రమ పడినట్లు మన యజమాని అయిన ప్రభువు కొరకు మనము కూడా శ్రమ అనుభవించి త్యాగము చేయాలి. మనము చేసే ప్రతి దానికి మరల వెయ్యి రెట్లు పొందుకుంటాము కాబట్టి ఇందులో మనము కోల్పోయేది ఏమి కూడా లేదు. మనము సహకారము అందించకపోతే సువార్త వ్యాపించటం చాలా ఆలస్యము అవుతుంది. ఎన్నో ఆత్మలను కోల్పోవలసి వస్తుంది. దేవుని యొక్క రాజ్యభారమును(కాడిని) నీవు ఎలా మోస్తున్నావు?