దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
ప్రభువు యొక్క సృష్టిలో ఆఖరుది, అద్భుతమైనదియునైన రూపకల్పన ఈ వచనములలో జరిగినది. అదేమానవులమైన మనలను చేయడము . ఇప్పటివరకూ జరిగిన సృష్టి కార్యక్రమములో దేవుడు తనలోతాను కాని, ఇతరులలో కాని నా చర్చించినట్లు మనకు కనిపించదు. మొదటిసారిగా ఇక్కడ మనిషిని చేయటానికి ఇతరులతో చర్చ జరిగినట్లు అర్దము అవుతుంది. మనము అనే మాట ఆ చర్చ చేసిన ఇతరులు ఆయనతో సమానులు, బాగా సన్నిహితులు అని అర్థము అవుతుంది. మన పోలికె, మన స్వరూపము అని పలికిన మాటలను బట్టి మిగతావారు కూడా దేవుని స్వరూపము, పోలికె కలిగినవారు అని స్పష్టము అవుతుంది. ఇక్కడ మనకు త్రిత్వము స్పష్టముగా కనిపిస్తుంది. లేఖనములను జాగ్రత్తగా పరిశీలన – చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్దాత్తుడు – తప్ప ఈలాగు స్వరూపము. పోలికె కలిగినవారు ఇంకెవరూ లేరు అని అర్ధము అవుతూ ఉంది. ఎలోహియ్ అనే ఆయన నామము కూడా ఇక్క డ ఈ విషయమును స్పష్టము చేస్తున్నది. కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడే మానవుని తయారుచేయటము జరిగినది తప్ప జీవ పరిణామ సిద్ధాంతమును అనుసరించి కోతి నుంచి మానవుడు రాలేదు. నీవు ఒక అద్భుతానివి, దేవుడు బహు శ్రద్ధ తీసుకుని చేసినవాడవు అని గుర్తించు.
సాధారణముగా మనుష్యులు ఏదైనా చేయాలి అని తలపెట్టినప్పుడు – వారు చేస్తున్న పని సక్రమముగా ఉన్నదా లేదా, అందులో ఏమైనా పొరపాటు జరిగి తమకు నష్టము ఏమైనా కలుగుతుందా అని చెప్పి – ఇతరుల లో చర్చ, సంప్రదింపులు జరుపుతారు. అదే దేవుడు ఏమి చేసినా అది Perfect గా ఉంటుంది. అందులో లోపము – ఉండటానికి అవకాశము లేదు. అయినా కాని ఆయన చర్చించటము బట్టి ఆ వస్తువు చేస్తున్నపుడు ఆయన ఇచ్చిన Attention – అనేది మనకు తెలియజేస్తుంది. దీనిని బట్టి ఆయన మనలను ఎంత శ్రద్ధ తీసుకుని చేసారు అనేది కూడా గ్రహించాలి. స్వరూపము, పోలికెలో పాలిభాగస్థులు అయిన వారి అనుమతి లేకుండా ఆయన ఆ పనిని చేయటానికి ఇష్టపడలేదు. దీనిని బట్టి వారు తండ్రి,కుమారుడు, పరిశుద్ధాత్ముడు) ఒకరిని ఒకరు గౌరవించుకుని నిర్ణయములు తీసుకుని కలసికట్టుగా అవలంబిస్తారు అని అర్ధము అవుతూ ఉన్నది. వారిలో వారు సమానము తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు అని గ్రహించాలి. వారిలో వారు ఎలాగైతే సమానత్వము, సమైక్యత కలిగి ఉన్నారో అలానే మనము కూడా సమైక్యత కలిగి వారు ముగ్గిరిని (3) సమానముగా ఆరాధించాలి, పూజించాలి. వాక్యమును అనుసరించి వారి గురించిన అవగాహన కలిగిఉండాలి తప్ప మనము వెళుతున్న church denomination బట్టి, మనం చదివిన Bible College Professor యొక్క అభిప్రాయమును బట్టి కాదు. మరి నీవు ఆయన నీకు ఇచ్చిన శ్రద్ధకు, జాగ్రత్తకు, సమానమైన శ్రద్దను జాగ్రత్తను ఆయన యెడల కనపరుస్తున్నావా?
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలసి సమైక్యముగా చేసిన సృష్టికి ప్రతిరూపమే మానవుడు. మనము మొదటి 5 దినములలోను, 6వ దినమున చెప్పుకొన్న సేవకుల లక్షణములు మనము కలిగి ఉన్నప్పుడు మనము చేరుకోవలసిన తరువాతి దశ ఆయన స్వరూపము, మరియు పోలికెలోనికి మారుట. దీని నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను భూమిమీద ఉండి సంఘములోను, మనలోను నిర్విరామముగా పని చేస్తున్నాడు. మనము కేవలము చీకటినుండి వేరుపడి రక్షణలోనికి నడువటము మాత్రమే కాకుండా ఆయన స్వారూప్యము, పోలికె సంపూర్ణముగా పొందుకోవాలి. ఈ సృష్టి కూడా దానితో ముగించబడినట్లు మనము కూడా పరిపూర్ణత అనేది సంతరించుకుంటాము. అందుకే ఆ పరిపూర్ణతలోనికి నడువటానికి అవసరమైన , పని ప్రారంబించమని, అందుకు కావలసిన మన అంగీకారము తెలియజేస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకుని దేవునితో నిబంధన చేసుకున్నాము. దానిని , బట్టి కుమారుడు తన రక్తము ద్వారా మన పాపములను, కడుగటము, తండ్రి మనలను అంగీకరించి జీవ గ్రంధములో స్థానము ఇవ్వడము, పరిశుద్దాత్మ దేవుడు మనలో ఉన్న పాత పాప స్వభావమును తొలగించి నూతన సృష్టిగా మార్చటము జరుగుతుంది. ముగ్గురు కలసి నిర్మించిన దానిని ముగ్గురు కలసి restore చేయటము జరుగుచున్నది. దేవుడు నిన్ను స్క్రాప్ చేయకుండా పునఃనిర్మాణము చేయటానికి పడుతున్న శ్రమను గుర్తిస్తున్నావా? ఆయన నిబంధన ఎప్పుడూ మీరడు.