దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)
పశువులు తమ యజమానులకు లోబడి వారి అదుపాజ్ఞలలో ఉంటాయి. బండిని మోసేటప్పుడు వాటిలో అవి సహకరించుకుంటాయి. పగలు ఎక్కడ వదిలి వేసిన గూడా సాయంత్రము సమయానికి యజమాని వద్దకు చేరుకుంటాయి. అవి తమ యజమాని ఎవరో గుర్తించగలుగుతాయి అని లేఖనము మనకు సెలవిస్తుంది. దీని ద్వారా మనము కూడా మన యజమానుడైన దేవునికి లోబడి ఉండాలి. ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మనలో మనము గొడవలు పడి, ద్వేషములు, విభేదాలు పెంచుకోకుండా భారమును సమానముగా పంచుకోవాలి. లోకములో అపవాది వెలుగు దూతవలె సంచరిస్తున్నాడు కాబట్టి మన యజమాని సరిగా గుర్తించాలి. ఆయన ఆజ్ఞకు పనికి మాత్రమే మనము స్పందించాలి. మనము యజమానిని గుర్తించే విషయములో విఫలము చెందుతాము అని దేవుడు యోషయ గ్రంధములో సెలవిస్తున్నారు. ఆలాగున జరగకుండా మనలను మనము జాగ్రత్తగా చూసుకుంటూ మెలకువగా ఉండాలి. పోషణ ఒకరి దగ్గర తీసుకొని శత్రువు కొరకు మనము పని చేయకూడదు. మనకు జీవము ఇచ్చిన, ఆరోగ్యము ఇచ్చిన దేవునికే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ జీవము లేని రోజున మనకు ఉనికి, మనుగడ లేదు అని గుర్తించాలి. మరి నీవు స్వతంత్రముగా వ్యవహరిస్తున్నావా? లేక నీ యజమానికి లోబడి ఉంటున్నావా? లోకములో మీ శ్రమ ద్వారా జీతము ఇచ్చే యజమానికి ఎంతలా లోబడతామో కదా. అలాంటిది సమస్తము నీకు ఇచ్చిన దేవునికి ఇంకా ఎంత లోబడి ఉండాలి ఆలోచించు.
పశువుల యొక్క పాత్రను మనము గమనించినప్పుడు భూమి దున్నటము దగ్గర నుంచి పంట ఇంటికి చేరే వరకు అవి పాత్ర పోషిస్తాయి. అలానే మనము కూడా దేవుని యొక్క పనిలో అది నుంచి అంతము వరకు మనము పాత్ర పోషించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానములో దేవుని రాజ్యమును పొలముతో పోల్చడము జరిగినది. ఆ పని అంతటిలోను మనము దాసుల యొక్క పాత్రను పోషించాలి. పశువులు ఎలాగైతే humble గా మారు మాట్లాడకుండా పనిచేస్తాయో అలానే మనముకూడా తగ్గించుకొని పని చేయాలి. వాటిలో లేనట్లే మనలో కూడా ఎవరు గొప్ప అనేది రాకూడదు.
పశువులు సాదు చేయబడతాయి. వాటికి మనము తర్ఫీదు అనేది ఇచ్చి మనకు నచ్చిన విధముగా మలచుకోవచ్చు. అలానే మనము కూడా దేవుని చేతిలో సాదు చేయబడటానికి సహకరించాలి. ఆయన చిత్తమును అనుసరించి పనులను చేయటానికి తర్ఫీదు ఇస్తున్నప్పుడు అవి శ్రద్ధగా నేర్చుకోవాలి. వాటిని మన శక్తి వంచన లేకుండా సంపూర్తి చేసి దేవుడు మన వలన సంతోష పడేలా చేయాలి. దేవుడు మనకు ఇచ్చిన జీవితమునకు ప్రతిఫలముగా కృతజ్ఞతగా మనము ఇది చేయటము మన కనీస బాధ్యత. ఆయన అదుపులో మనము ఎల్లవేళలా పోషింపబడి, సురక్షితముగా ఉండగలము. HIS care is the best.
ఈ పశువులలో కొన్ని మానవుని పాపముల నిమిత్తము బలిగా అర్పించటానికి దేవుడు ఉపయోగించినట్లు మనము ధర్మశాస్త్రములో చూడగలము. అలా వాటిని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉపయోగించటము జరిగినది. అందులో పవిత్ర జంతువులను మాత్రమే ఆయన అంగీకరించారు. మనము కూడా పవిత్రమైన జీవితము కలిగి లోకములో ఇంకా పాపములో మునిగియున్న ప్రజలను రక్షించటానికి దేవుడు మనలను ఉపయోగించుకునేలాగున సహకరించాలి. మనము చాయయే గాని ప్రభువులము కాదు అని గుర్తెరిగి సరిగా ప్రవర్తించాలి. మనము సరైన జీవితము జీవించకపోతే కుక్క,పందితో పోల్చిన విధముగా ఎలా ఉండకూడదు అనేదానికి మనము ఉదాహరణ క్రింద మారి దేవుని చేత తృణీకరించబడే ప్రమాదము ఉన్నది. బలికి దేవుడు మచ్చ, డాగు కలవాటిని అంగీకరించలేదు. అవి సమస్తము నిర్దోషమైనవిగా ఉండాలని పదే పదే సూచించటము మనకు పరిశుద్ద గ్రంధములో స్పష్టముగా కనిపిస్తుంది. ఆయన చేత ఎన్నుకొనబడి, వాడుకొనబడటము కన్నా అద్భుతమైన ఆశీర్వాదము, అదృస్టము ఈ లోకములో మనకు వేరేవి ఇంకేమీ కూడా లేవు. మరి నీ జీవితము ఎయా ఉన్నది? దేవుని చేత వాడబడుటకు, అంగీకరించబడుటకు నీవు సిద్దముగా ఉన్నావా? అడవి జంతువులను ఆయన బలికి ఎక్కడా ఉపయోగించలేదు అని గమనించి అటువంటి లక్షణములను దూరపరచుకోవాలి.