దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
ఈ విధముగా దేవుడు మనలను ప్రేమించి అన్ని విషయములలో మనలను తలగానే నియమించారు తప్ప తోకగా ఎక్కడా కూడా చేయలేదు. మనము పరిశుద్ధ గ్రంధము జాగ్రత్తగా పరిశీలించినపుడు ఆయన మన విషయములో పలికిన ఆశీర్వాదములు, దీవెనలు ఎప్పుడూ అన్నింటికన్నా మిన్నగానే ఉన్నాయి. మనిషి నిటారుగా ఒకటి సంఖ్యలాగా నిలబడే విధముగా టీవిగా దేవుడు చేయటము జరిగినది. ఆయనకన్నా మన మేలు కాంక్షించేవారు, దాని కోసము , అహర్నిశలు శ్రమించేవారు ఎవరూ ఈ సృష్టిలో లేరు అంటే, అతి అతిశయోక్తి కాదు. తల్లితండ్రుల ప్రేమ కూడా ఆయన ప్రేమముందు దిగదుడుపే. ఆయన మాట మాత్రము వింటే చాలును. మన జీవితములు ఎంతలా మారతాయి, అద్భుతముగా తీర్చిదిద్దబడతాయి అనేది మన ఊహకు కూడా అందదు. మనము ఆయన లక్షణములను అర్ధము చేసుకోవటానికి లేఖనములను మరి విశేషముగా ధ్యానించాలి. ఆయన స్వరూపము, పోలికె గురించిన అవగాహన మనకు లేకుండా మనము అందులోనికి నడువలేము కదా. అందుకే వాటిగురించి బాగా స్టడీ చెయ్యాలి. మన ఉద్యోగము కోసము, interests కోసము స్టడీ చేసిన దానికన్నా ఎక్కువగా పరిశుద్ధ గ్రంధము స్టడీ చెయ్యాలి. అపుడే మన జీవితమును గురించిన సంపూర్ణమైన అవగాహన మనకు నిజముగా లభిస్తుంది. మరి ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమును ఎంత శ్రద్దగా, passionate గా నువ్వు స్టడీ చేస్తున్నావు?
Verse 26-28 praise
- మనలను ఆయన స్వరూపములోను, పాలికె లోను చేసినందుకు
- తన చేతి పనుల మీద మనకు అధికారము అప్పగించినందుకు ఒక
- మనకు ఇచ్చిన ఆశీర్వాదము కొరకు
- మనకు సాటి అయిన సహకారిగా ఇచ్చిన స్త్రీ కొరకు
- తన స్వహస్తములలో మనలను చేసినందుకు
Verses 26-28 Worship
- మనము పాక్య ధ్యానము, పార్ధన, పరిచర్య ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము, పాలికె లోనికి మారుట ద్వారా దేవునిని ఆరాధించాలి
- మనకు ఇవ్వబడిన అధికారమును పరలోకపు ప్రమాణముల ప్రకారము, దేవుని మార్గమును అనుసరించి వినియోగించుట ద్వారా దేవునిని ఆరాధించాలి
- మన అధికారములో ఉంచబడిన దానిని సక్రమముగా సంరక్షించి, – పరిపాలించుట ద్వారా దేవునిని ఆరాధించాలి
Verses 26-28 Caution
- మనము ఆయన స్వరూపము, పోలికె లోనికి మారకపోతే భూమి – మీద అధికారమును పొందలేము
- స్త్రీని కూడా మనకు ఇవ్వబడిన అధి కారములోను, ఆశీర్వాదము Pలోను సమాన పాలిభాగస్తురాలిగా చూడాలి.
- మన అధికారములో ఉన్న జీవులను హింసించి, వాటిని నాశనము – చేయకూడదు.
- మన పరిపాలన గురించి దేవునికి ఒక దినమున లెక్క అప్పగించాలి