మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).
దేవుడు ఆకాశము మలచినతీరు చూడగా ఆయన దానిని అంత ఎత్తున చేయబట్టే, అనుకూలమైన పరిస్థితులు కల్పించబట్టే మన విమాన ప్రయాణములు, satellite ప్రయోగాలు, communication వ్యవస్థ సాధ్యము అయింది. ఆయన గనుక ఈ విధమైన infrastructure create చేసి ఉండకపోతే మన పరిస్థితి ఏమిటి? ఆకాశములో satellite ఉంచటానికి తగిన ఖాళీస్థలం లేకుండా మిగిలిన గ్రహములతోను, నక్షత్రములతోను నింపి ఉంచితే పరిస్థితి ఏమిటి? ఇది నా స్వంత ప్రదేశము. భూమి పరిధి దాటి మీరు రావటానికి వీలులేదు అంటే ఏమి ఉండేది? ఆయన ముందుగానే ఇవి అన్నీ ఊహించి ఆకాశమును మనకు science play ground క్రింద చేసి ఉంటారా? ఆలోచించండి. వీటిలో ఏదీ కూడా మనకు అనుకూలముగా మనము మలుచుకొనలేదు. చేసి ఇచ్చినదానిని వాడుకుంటున్నాము. ఆయన ఎప్పుడూ మనలను restrict చేయలేదు. మనము మాత్రము ఆయనను ప్రతి విషయములోను మన జీవితములో restrict చేస్తూ ఉన్నాము. మన ప్రవర్తన గురించి ఆలోచిస్తే మనకే సిగ్గుగా ఉంది. మన జ్ఞానము అసలు ఏమిటి అనిపిస్తుంది. దేవుని ప్రేమను, మనస్సును అర్థము చేసుకోవటానికి, ఆయన విశాలహృదయము తెలుసుకోవటానికి ఇప్పటికి అయినా మన జ్ఞానము ఉపయోగిద్దాము. దేవుడు మనకు సహాయము చేయును గాక. యేసు నామములో ఆమెన్.
విశాలము పైన ఉన్న జలములను దేవుడు తూములలో బిగించి పెట్టినట్లు మనకు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. విశాలము క్రింద జలములు ఎలాగైతే సముద్రములుగా మనము చూస్తున్నామో విశాలము మీద కూడా అదే పరిమాణములో జలములు ఉన్నాయి అని ఈ వాక్యములు మనకు తెలియజేస్తున్నాయి. అయినా అవి మనమీదకు ప్రవాహముగా పొర్లి రాకుండా మనకు ప్రమాదము సంభవించకుండా వాటిని ఆపారు. మన జీవనమనకు అవసరమైన వర్షం రూపములో వాటిని మనకు అనుగ్రహిస్తున్నారు. మనము కూడా భూమిమీద తూములలో, damsలో వాటిని భద్రము చేస్తున్నాము. మన పర్యవేక్షణలో ఎన్నిaccidents జరుగుతున్నాయో మనకు తెలియనిది కాదు. కానీ అలాంటి ప్రమాదములు పైన ఆకాశములో ఉన్న తూముల విషయములో జరగటము లేదు అంటే అవి మనకు ప్రమాదముగా పరిగణించకుండా ఉండటానికి ఆయన ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పర్యవేక్షణ ఏర్పాటు చేసి ఉంటారు అనేది ఆలోచించాలి. ఒక్క ప్రమాదము జరిగి ఆ నీరు ఉప్పెట్టున భూమి మీదకు వస్తే పరిస్థితి ఆలోచించటానికే వణుకు వస్తుంది. మరి ఆయన గౌరవము, నామము ప్రమాదములో పడకుండా మనము జాగ్రత్త తీసుకుంటున్నామా? ఆయన మనమీద చూపిస్తున్న care లో ఎంత % తిరిగి మనము ఆయన మీద చూపిస్తున్నాము?
పైన ఆకాశములో దేవుడు జలములను మాత్రమే కాకుండా ఆశీర్వాదములు, జ్ఞానమును కూడా మనకొరకు పొందుపరిచారు. మనము జ్ఞానమును, దేవుని ప్రక్కనపెట్టి ఆకాశమునుండి కేవలము ఆశీర్వాదముల కొరకు మాత్రమే ఎదురుచూడటము వలన మన భక్తి, సమాజ జీవితము ఇంత దయనీయముగా, అధ్వానస్థితిలో ఉన్నాయి. ఆ ఆశీర్వాదములు అన్నీమనకు లాభమును మాత్రమే తీసుకునివస్తాయి, ఎక్కడా నష్టము కలిగించే లక్షణము లేదు కాబట్టి, వాటిద్వారా మనకు కష్టపడకుండా సంతోషము, సుఖము లభిస్తాయి కాబట్టి వాటిని ఎక్కువ కోరుకుంటున్నాము. వాటివలన ఏదైనా కోల్పోవాలి అని అనుకుంటే మాత్రము వాటిని కూడా స్వీకరించడానికి ఇష్టపడము. దీనివలన మనలో స్వార్థము కరడుగట్టుకుని పోయింది. ఆ జ్ఞానమును కూడా మనము సంపాదించుకుంటేనే మన జీవితములో సుఖజీవనము సాగించే సంవత్సరములు వస్తాయి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దానిద్వారా ఆకాశములోని science and technology కి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి అర్థం అవుతాయి. వాటిద్వారా మనము మరింత ప్రగతి సాధించవచ్చు. దేవుడు science కు వ్యతిరేకము కాదు అయితే అది ఎప్పుడూ సత్యమునకు లోబడి ఉండాలి అనేది ఆయన అభీష్టము