దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
దేవుడు మనలను తన స్వరూపము, తన పోలికలో సృజించినప్పటికీ మనలను అందరినీ ఒకే మూసలో నుంచి Xerox copy లాగా చేయలేదు. మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన రూపము, ప్రణాళిక, destinyఅనేది కలిగించడము జరిగినది. పరలోకములో కూడా మన అందరికీ కలిపి ఒక stadium నిర్మించకుండా ప్రతి ఒక్క కుటుంబమునకు ప్రత్యేకమైన నివాసములు నిర్మించడము జరిగినది. మనము ప్రపంచములో ఇప్పటికే ఎన్నో కోట్ల మందిమి జన్మించినా కూడా మన వేలి ముద్రలు, కన్నులు, ముఖ కవలికలు వేరే ఎవరితోనూ కూడా సరిపోల్చబడవు. అవి unique గా ఉంటాయి. దానిని బట్టి మనలో ప్రతి ఒక్కరమూ ఎంతో శ్రద్ధగా , దేవుని ద్వారా చేయబడినవారము అనే విషయము అర్ధము అవుతూ ఉన్నది. మనము ఆయన యెడల సరైన శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ చూపకుండా, ఆయనను మన పాపముల ద్వారా విసికిస్తున్నా కూడా, ప్రేమగా ఇంకా మనలను తయారుచేస్తున్న దేవుని ప్రేమకు పాదాభివందనములు. ఆయన ప్రేమను వివరించుటకు బాష అనేది సరిపోదు మన హృదయమునకు కన్నీరు తప్ప మాట రాదు. మనము అంత అద్భుతముగా తీర్చిదిద్దబడితే మనమే మన జీవితముల యొక్క విలువను గుర్తించకుండా నాశనము చేసుకుంటున్నాము. మన తండ్రి హృదయము దుఃఖము కలిగిస్తున్నాము. ఇప్పటికైనా ఆయనను, ఆయన విలువను మన జీవితములో గుర్తిద్దాము. మన ప్రవర్తన మార్చుకుందాము, తండ్రిని సంతోషపరచే కుమారునిగా అందరి చేత గుర్తింపు పొందుదాము.
దేవుడు తన స్వరూపము, పోలికెలో మనలను సృజించినపుడు తన చేతిపనులు అన్నిటి మీద భూమిమీద అతనికి అధికారము ఇవ్వటము జరిగినది. దీనికి ఏవిధమైన షరతులు కుడా విధించలేదు . ఆయనలో మనకు కలిగిన సంబంధమైన కుమారత్వము ద్వారా మాత్రమే ఇది మనకు సంభవించటము జరిగినది తప్ప ఆ మనము ఏదో చేసి, దేవుని సంతోషపరచి, అర్హత పొంది,సంపాదించుకున్నది మాత్రము కాదు. కేవలము ఆయన ప్రేమ, ఆ కృప ద్వారా మాత్రమే ఇది సాధ్యము అయినది. మనము ఎప్పుడైతే – పాపములో పడిపోయామో ఆ యొక్క స్వరూపము, పొలికె కోల్పోయి బంధకములు, అంధకారములోనికి వెళ్లిపోవటము జరిగినది. మరలా వాటిని తెంచుటకు, కోల్పోయిన ఆ స్వరూపము పోలికె తిరిగి తెచ్చుటకు మానవుని రూపములో మన మద్యకు వచ్చి బలి అర్పించడము జరిగినది. సృష్టిలో మరి దేనికోసము ఇలాగున చేయని దేవుడు, నీ కోసము చేయడము నీవు గమనించినపుడు నీకు ఏమి అర్ధము అవుతుంది? ఆయన ప్రేమను నీవు గుర్తించావా?
నీవు ఆయనను ప్రేమించకపోయినా ఆయన తప్పిపోయిన నీ కొరకు దినమెల్ల ఎదురుచూస్తూ ఉన్నాడు. ” నిన్ను తన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనము భూమిని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన చేతి పనులు ఎంత effortతో కూడుకున్నవి అని అర్థము అవుతుంది. అంత కష్టపడి కూడా తనకోసము ఏమీ ఉంచుకొనకుండా నిన్ను మాత్రమే కోరుకుని సమస్తము అప్పగించడము జరిగినది. మరి నీవు కూడా ఆయనకు నీ జీవితము మీద అధికారము ఇవ్వగలవా? నీవే చాలు అని ఆయన కొరకు సమస్తమును త్యాగము చేయగలవా? ఆయన శిష్యులు ఆయన కొరకు సమస్తమును ధారపోశారు. ప్రతి విషయములోను దేవుడు ముందుగా చేసి మనకు మాదిరి అనేది చూపించి, తరువాత మనలను చేయమనటము జరిగినది. అందుకే ఆయనను వెంబడించటము మనకు ఆవశ్యకము. ముందుగా ఆయన నడచినాడు కాబట్టి మనలను జాగ్రత్తగా నడిపించగలడు. మనము క్రొత్తగా ఏదీ కనిపెట్టవలసిన, Unknown Risks, ఎదుర్కోవలసిన అవసరము లేదు.
ఆయన మహారాజుగా, చక్రవర్తిగా ఉండి, మనము ఆయన క్రింద పనివారుగా, తక్కువగా ఉండాలి అని కోరుకోలేదు కాని, ఆయనలో సమానముగా ఉండాలి అనే కోరుకున్నారు. అందుకే మనలను భూమిమీద రాజులుగా నియమించటము జరిగినది. మనము ఎప్పుడైతే పాపములో నివసిస్తామో, ఆ అధికారము కోల్పోతాము. అందుకే మన జీవితములలో పాపము రాజ్యము చేస్తుంది. లోకముమీద అధికారము చెలాయిస్తూ ఉంది. మనము మరలా ఆ స్వరూపము పోలికెలోనికి మారినప్పుడు ఆ అధికారమును తిరిగి సంపాదించుకుంటాము. అందుకే మన రక్షణ క్రమములో ఆఖరి మజిలీ దశగా ఇది పేర్కొనబడినది. మరి నీవు ఆ పరిపూర్ణతకు , ఎంత దూరములో ఉన్నావు. ఇంకా పాపము నీ జీవితములో ఏలుబడి చేస్తుందా? నీవు మరలా పరిగెత్తటము మొదలుపెట్టి నీ గమ్యము చేరుకో. దేవుడు నీకు సహాయము చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజే ఆయనకు ప్రార్ధనచేసి కుమారత్వము కొరకు అడుగుము. You are a king.