దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
మనము అందరమూ విస్తరించాలి, ఒకే చోట, ఏదో ఒక మూలన ఉండాలి అని దేవుడు కోరుకోవటము లేదు. భూమి అంతటా వ్యాపించి దానిని నింపాలి అని ఆయన చిత్తము. పరిశుద్ధ గ్రంథము కూడా దేవుడు భూమిని నివాసయోగ్యముగా ఉండటానికి సృష్టించాడు అని తెలియజేస్తుంది. అందుకే దేవుడు ఆదికాండము 11వ అధ్యాయములో ప్రజలందరూ ఒకే చోట నివసించాలి అనుకున్నపుడు ఆయన వారిని చెదరగొట్టడము జరిగినది. ఒకవేళ మనము చేస్తున్న పనులు చెదరగొట్టబడుతూ ఉంటే అవి దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఉన్నాయేమో చూసుకోవాలి. అందుకే మానవాళి మొత్తము భూమిమీద వ్యాపించటమును మనము చూడగలము. మనలో ప్రతి ఒక్కరికీ భూమిమీద ఎక్కడికి అయినా వెళ్లి బ్రతకటానికి అధికారము దేవుని ద్వారా ఇవ్వబడినది. సాతానుడు దేశములు, సరిహద్దులు అంటూ ఆ హక్కును హరించాడు. వీసాలు, పౌరసత్వము, సభ్యత్వము అంటూ మానవుని హక్కును హరించాడు. దేశముల మధ్య విద్వేషములు రగిలించుట ద్వారా వారు స్వేచ్చగా కదలకుండా, యుద్దముల ద్వారా మరణించాలి అని వాడి ఉద్దేశ్యము. అయితే దేవుడు అది సాగకుండా అనుక్షణము రక్షణ దయచేస్తున్నందుకు వందనములు దేవుడు సమస్తమును మనకు ముందుగా ఇచ్చి ఆరాధించమంటే, సాతాను మాత్రము మొదట ఆరాధిస్తే తరువాత అన్ని ఇస్తాను అని చెప్తాడు. వాటిలో ఏదీ వాడు చేయలేదు. మననుంచి మోసము ద్వారా లాక్కున్నదే. మనము ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో అది మన సొంతము అవుతుంది.
ఈ విధముగా భూమిని నింపటము అనేది కేవలము సంఖ్యాపరముగా మాత్రమే మనము చూడకూడదు. దేవుడు కేవలము ఆ సంఖ్య కోసము అనుకుంటే రాళ్లను కూడా మానవులుగా చేయగలడు. లేదా ఒకే కాన్పులో జంతువులకు మాదిరిగా అనేకమంది పిల్లలను పుట్టించి ఉండేవారు. కాని అలాగున కాకుండా ఒక్కోక్కలను ఇవ్వడములో గల ఉద్దేశ్వము, ప్రతి ఒక్కరి విషయములో ఆయన concern కలిగి ఉన్నాను అని చెప్పుటకే, మందిలాగా అందరినీ పెంచకుండా ప్రతి ఒక్కరినీ దేవుని చిత్తములోను, ఆయన స్వరూపము, పోలికలోను పెంచాలి అని, అలాంటి వారు, నీతిమంతులు భూమిమీద విస్తరించాలి అని దేవుడు ఎంతో కోరుకున్నారు. మనము అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సంఖ్య పరముగా పిల్లలను కని మన చిత్తములో పెంచటము వలన భూమిమీద పరిస్థితులు ఎలా మారాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అందుకే మనము పరలోకము కన్న భూమిమీద నరకమును సృష్టించాము. దీనిని మరలా పరలోకము క్రింద మార్చాలి అనే దేవుడు తాపత్రయము కలిగి మన అందరి జీవితములలో పనిచేయటానికి ఇష్టపడుతున్నాడు, వెంటపడుతున్నాడు, ఎదురుచూస్తున్నాడు. ఇందులో సమస్తము మన మేలు తప్ప ఆయన స్వార్థము ఏమీ లేదు. పిల్లల జీవితము పాడైతే ఎలా బాగుచేయాలి అనే దానికి మనకు మాదిరి. నీవు భూమిని నరకముగా మార్చి గుంపులో ఉన్నావా లేక పరలోకముగా మార్చే గుంపులో ఉన్నావా?
భూమిని లోపరచుకొని దానిని ఏలాలి అనేది దేవుని చిత్తములో అనగా భూమిమీద మనము తప్ప వేరే అధికారము ఏదీకూడా ఉండకూడదు. ఈ అధికారము మనము దేవుని స్వరూపము, పొలికెలో ఉండి పాపమును సంపూర్ణముగా జయించగలిగినపుడు మాత్రమే మనకు లభిస్తుంది అనే విషయము గ్రహంచాలి. కేవలము పాపము ద్వారా మాత్రమే సాతానుడు మన దగ్గరనుంచి ఈ అధికారమును లాగుకొనగలడు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనలో పాపమును జయించగలిగారు. అందుకే ఆయన స్వరూపము, పొలికె లోనికి మారినప్పుడే ఇది సాధ్యము. అప్పుడు మాత్రమే వాడు మనలను ఏలాగు శోధించినను మనము విజయము సాదించగలము మన అధికారమును చేజిక్కించుకోవటము అసాధ్యము అవుతుంది. ఇదే సాతానులో మనము చేయవలసిన నిజమైన అత్మీయ యుద్ధము. అంతేకాని ఎంతసేపు దెయ్యములను వదిలించడము, బందించటము కాదు. మనము ఆయన దేవుని స్వరూపము లోనికి మారకపోతే అవి మరలా మనలో ప్రవేశించే అవకాశము కలదు. మనము వీటికి అవకాశము ఇవ్వకూడదు అని దేవునికి లోబడి ఉండాలి అని లేఖనము చెప్తుంది. వాక్యము ద్వారా మనలను కట్టుకున్నపుడే అది సాధ్యము, మరి నీవు భూమిని స్వతంత్రించుకునే పనిలో ఉన్నావా? నీ యుద్దము, preparation లోకానుసారమైన పద్దతిలో ఉన్నదా లేక పరిశుద్ధ గ్రంథములోని ఆత్మీయ యుద్ధమును పోలి ఉన్నదా? Its about change not strength.